Chiranjeevi's Remuneration Per Film: అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఎవరైనా చిరంజీవి తరువాతే..

Chiranjeevi's Remuneration Per Film: చిరంజీవి స్టార్‌డమ్ ఇప్పుడే కాదు... 3 దశాబ్ధాల క్రితం కూడా ఏ రేంజులో ఉండేదో చెప్పే కథనం ఇది. చాలామందికి చిరంజీవి అంటే ఒక గొప్ప స్టార్ హీరో అని మాత్రమే తెలుసు.. కానీ చాలామందికి తెలియని ఆసక్తికరమైన అంశం ఒకటుంది. అది కూడా చిరంజీవి పారితోషికం విషయంలో.. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే. 

Written by - Pavan | Last Updated : Jun 7, 2023, 12:33 AM IST
Chiranjeevi's Remuneration Per Film: అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఎవరైనా చిరంజీవి తరువాతే..

Chiranjeevi's Remuneration Per Film: ఇండియాలో ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు లేదంటే అంతకంటే ఎక్కువ కూడా వసూలు చేస్తున్న హీరోలు ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు కేవలం పారితోషికం మాత్రమే తీసుకుని సరిపెట్టుకోకుండా లాభాల్లోనూ వాటాలు తీసుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో ఆ సినిమా కమెర్షియల్ హిట్ అయితే.. ఆ సినిమా చేసిన హీరోలకు పారితోషికం, లాభాల్లో వాటాలు అన్నీ కలిపి రూ 200  కోట్లకుపైనే అందినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది అంతా కూడా వాళ్ల మార్కెట్ స్ట్రామినాపై, బాక్సాఫీస్ రేసులో నిలబడి, పోటీని తట్టుకుంటూ ముందుకు దూసుకుపోయే కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. 

ఇప్పుడు పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి మాత్రం ఉండేది కాదు. ఒక 3 దశాబ్దాల వెనక్కు వెళ్తే.. అప్పట్లో కోటి రూపాయల పారితోషికం తీసుకోవడమే చాలా గొప్ప విషయం. ఎంత నేమ్ అండ్ ఫేమ్ ఉన్నప్పటికీ.. కోటి రూపాయలు డిమాండ్ చేసే ధైర్యం చేయలేకపోయిన స్టార్ హీరోలే ఎక్కువగా ఉన్నారు. అలాంటి రోజుల్లోనూ మొత్తం భారత్ దేశంలోనే మొట్టమొదటిసారిగా రూ. కోటి పారితోషికం తీసుకున్న హీరో ఎవరో తెలుసా.. ఇంకెవరు.. మన తెలుగు వారు మెచ్చిన మెగాస్టార్ చిరంజీవినే. అవును.. మీరు చదివింది నిజమే.. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కూడా కోటి రూపాయలు అడిగే ధైర్యం చేయని ఆ రోజుల్లో 1994 లో ఆపద్భాంవుడు సినిమా కోసం మన మెగాస్టార్ చిరంజీవి 1.25 కోట్లు తీసుకోవడం విశేషం.

అమితాబ్ బచ్చన్ కంటే చిరంజీవినే ఎక్కువ.. అని రాసిన స్టార్‌డస్ట్ మ్యాగజైన్ 
చిరంజీవి : బిగ్గర్ దాన్ బచ్చన్.. సెప్టెంబర్ 1992 ఎడిషన్‌లో స్టార్‌డస్ట్ మ్యాగజైన్ ఇదే శీర్షికతో ఒక కవర్ స్టోరీ పబ్లిష్ చేసింది. అప్పట్లోనే చిరంజీవి రేంజ్ అంటే ఏంటో ఆ కవర్ స్టోరీ చాటి చెప్పింది. ఆపద్బాంధవుడు సినిమా కోసం రూ. 1.25 కోట్లు పారితోషికం చార్జ్ చేసి ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా రికార్డుకెక్కారు. కళాతపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆ సంవత్సరం చివర్లో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. అదే సమయంలో అమితాబ్ బచ్చన్ ఒక్కో సినిమాకు రూ.85 - 90 లక్షలు తీసుకుంటున్నారు. అందుకే స్టార్ డస్ట్ మ్యాగజైన్ " చిరంజీవి : బిగ్గర్ దాన్ బచ్చన్ " అనే టైటిల్‌తో కథనాన్ని ప్రచురించింది.

చిరంజీవి తరువాత మళ్లీ కోటి రూపాయల పారితోషికం తీసుకున్న నటుడిగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ రికార్డు సాధించాడు. ఆ తరువాత రజనీకాంత్ కూడా కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరోల క్లబ్ లో చేరాడు. 1995లో గ్యాప్ తీసుకున్న అనంతరం తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అమితాబ్ బచ్చన్.. ఆ తరువాత చేసిన చిత్రాలకు కోటి రూపాయలకు పైగా చార్జ్ చేయడం ప్రారంభించాడు. అప్పుడప్పుడే స్టార్ హీరోలుగా నిలదొక్కుకుంటున్న కొత్త తరం హీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా 90వ దశకం చివరికి వచ్చేసరికి కోటి రూపాయల క్లబ్ లో చేరారు. 

ఇది కూడా చదవండి : Adipurush Pre Release Event: 'ఆది పురుష్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్.. పెళ్లిపై స్పందించిన ప్రభాస్‌!

మరి మరి నాగార్జున, వెంకటేష్, బాలయ్య బాబు.. ?
మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తెలుగులో చిరంజీవితో సమకాలీనులుగా పేరున్న నాగార్జున, వెంకటేష్‌, బాలయ్య బాబు లాంటి హీరోలు కూడా 1990 చివరి దశలో ఒక్కో సినిమాకు కోటి రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకోవడం మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి : Most Scariest Horror Movies: గజ్జున వణికించే భయంకరమైన హారర్ సినిమాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News