Shani Dev: శనిదేవుడి ఫేవరెట్ రాశులేంటో తెలుసా? మీపై శనిదేవుడి అనుగ్రహం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?
Shani Remedies: శని దేవుడికి కోపం వస్తే జీవితాన్ని నాశనం చేస్తాడు, శని ప్రసన్నుడైతే జీవితంలో దేనికీ లోటు ఉండదు. శనిగ్రహం శుభప్రదంగా ఉంటే దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.
Shani Remedies: ఆస్ట్రాలజీలో శనిగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. వ్యక్తి యెుక్క జాతకంలో శని శుభస్థానంలో ఉంటే అతడు తర్వలోనే ధనవంతుడు అవుతాడు. అదే కుండలిలో శని అశుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి పేదవాడిగా మారిపోతాడు. శని కర్మను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని (Shanidev) న్యాయదేవుడు అంటారు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం మంచి రోజు. ఈ రోజున శనిదేవుడి ముందు ఆవనూనె దీపం వెలిగిస్తే వారిపై శని అనుగ్రహం కురిపిస్తాడు. శని దేవుడి కృప ఏయే రాశులవారిపై ఉంటుందో తెలుసుకుందాం.
శనిగ్రహానికి ఇష్టమైన రాశిచక్రాలు..
శనిదేవుడు కుంభం, మకరరాశికి అధిపతి. ఈ రెండు రాశులపై శనిదేవుడు ఎల్లప్పుడు వరాల జల్లు కురిపిస్తూ ఉంటాడు. తుల రాశిలో శనిగ్రహం ఉన్నత స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈరాశివారిపై కూడా శని కటాక్షం ఉంటుంది. ఈ మూడు రాశులవారు శనిదేవుడి అనుగ్రహంతో లగ్జరీ లైఫ్ గడుపుతారు.
శనిదేవుడి శుభప్రదమైన సంకేతాలు
>> మంచి పనులు చేసేవారు, నిజాయితీపరులు, పేదలకు సాయపడేవారు, స్త్రీలను గౌరవించేవారిపై శనిదేవుడు దయ ఎల్లప్పుడూ ఉంటుంది.
>> శనిగ్రహం శుభ స్థానంలో ఉంటే.. ఏ వ్యక్తికి కష్టాలు, ఇబ్బందులు తలెత్తవు. ఆ వ్యక్తి సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందుతాడు.
>> ఒక వ్యక్తి చిన్న ప్రయత్నంతో విజయం సాధిస్తే..అది శని యొక్క అనుగ్రహానికి సంకేతం.
>> అకస్మాత్తుగా డబ్బు రావడం, సమాజంలో గౌరవం లభించడం కూడా శనిదేవుడి దయకు సంకేతం. వీరు తక్కువ సమయంలో ధనవంతులు అవుతారు.
>> శనివారం నాడు గుడిలో బూట్లు, చెప్పులు చోరీకి గురైతే శని అనుగ్రహం మీపై కురుస్తుంది.
Also Read: Shani Vakri 2022: ఈ 3 రాశులవారి జాతకంలో 'ధన రాజయోగం'... 2 నెలలపాటు డబ్బే డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook