Shani Vakri Effect 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ఏదైనా గ్రహం యెుక్క సంచారం, తిరోగమనం, కదలిక ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై కనిపిస్తుంది. వ్యక్తి యెుక్క కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. జూలైలో శని మకరరాశిలో (Saturn retrograde in Capricron) తిరోగమించింది. శని తిరోగమన స్థితిలో ఉండటం వల్ల మూడు రాశుల వారి జాతకంలో రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశులవారికి మేలు చేస్తుంది.
మేషం (Aries)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని తిరోగమనం వల్ల ఈ రాశిలో ధన రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలోనూ రాణిస్తారు. మేష రాశి వారి జాతకంలో రుచక్, షష్ అనే రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగాలు చాలా పవిత్రమైనవి మరియు ఫలవంతమైనవిగా భావిస్తారు. దీని వల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. కొత్త జాబ్ రావచ్చు. అదృష్టంతో అన్ని పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో టైగర్ స్టోన్ ధరించడం వల్ల మేలు జరుగుతుంది.
మిథునం (Gemini) - ఈ రాశిలో ధన రాజ యోగం ఏర్పడటంతో వీరికి లక్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మిథునరాశివారి సంచార జాతకంలో భద్ర, హన్స్ అనే రాజయోగం ఏర్పడుతోంది. ఇది వ్యాపారంలో మంచి లాభాలను తెస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వ్యాపారులు లాభపడతారు. ఈ సమయంలో గోమేధిక రత్నాన్ని ధరించడం వల్ల శుభఫలితాలను పొందుతారు.
కన్య (Virgo)- ఈ రాశికి చెందిన వ్యక్తుల సంచార జాతకంలో హన్స్ మరియు భద్ర అనే రాజయోగం ఏర్పడుతోంది. వీరి అదృష్టం కారణంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారం విస్తరిస్తుంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో పచ్చని ధరించడం వల్ల లాభం చేకూరుతుంది.
Also Read: మార్గి శని ఎఫెక్ట్... అక్టోబరు 23 నుంచి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook