These are Shanidev Grace and Punishment signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... శని దేవ్‌ను న్యాయ దేవుడిగా భావిస్తారు. శని దేవుడు ఓ వ్యక్తికి అతని కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. శని దేవుడి దయతో ఒక వ్యక్తి రాజు అవుతాడు. అంటే శని దేవుడి అనుగ్రహం ఉంటే.. సుఖం, ఐశ్వర్యం, వైభోగం అన్నీ పొందుతాడు. శని దేవుని ఆశీస్సులతో మనిషి ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. అదే శని దేవుడి ప్రతికూల దృష్టి ఉన్నప్పుడు..ఓ వ్యక్తి ఆకాశం నుంచి నేలపై పడతాడు. వ్యక్తి జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే.. అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వ్యక్తి శని దేవుడి అనుగ్రహాన్ని పొందుతున్నాడా లేదా ఆగ్రహానికి గురవుతున్నాడనే విషయం మనుషులకు అస్సలు తెలియదు. శని దేవుడి ప్రభావంను మనుషులు ముందుగా తెలుకోలేరు. శని దేవుడి సంకేతాలను జీవితంలో జరిగే సంఘటనల ద్వారా మాత్రమే గుర్తించవచ్చు. ఒక వ్యక్తిపై శనిదేవుడు అనుగ్రహం ఉంటే.. అతడికి సమాజంలో గౌరవం మరియు పేరు లభిస్తాయి. అలాంటి వ్యక్తులు ఏదో ఒక విధంగా జీవితంలో ముందుకుసాగుతారు.


శని దేవుడి దయ ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది. నిత్యం డబ్బు వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. అధిక లాభాలు ఉంటయి. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ఇక ఆలయంలో పాదరక్షలు దొంగిలించబడటం కూడా శని దేవుడి యొక్క శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. చెప్పులు పొతే.. శని పోయినట్టే. 


ఓ వ్యక్తి జాతకంలో శని దేవుడి అనుగ్రహం లేకపోతే.. అలాంటి వారి ఆరోగ్యం ఎప్పుడూ బాగుండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు మాత్రం అస్సలు తీరవు. ఎప్పుడూ డబ్బు పోతుంది. కష్టపడి పని చేసినా డబ్బు మిగలదు. డబ్బు సంపాదించే దారులన్నీ మూసుకుపోతాయి.


(Disclaimer: పై వివరాలు సాధారణ అంచనాలు మరియు సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ZEE NEWS TELUGU దానిని నిర్ధారించలేదు)


Also Read: Diwali 2022: మాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం.. దీపావళి అనంతరం ఈ 6 రాశుల వారికి అదృష్టమే!


Also Read: నాకు మొగుడిని వెతికినందుకు థాంక్స్.. ఇంకా ఆ విషయాలు కూడా చెప్పండి: అనన్య నాగళ్ల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook