Sawan Vinayak Chaturthi 2022 Puja Muhurt, Ganesh Puja: ప్రతి నెలలో రెండు చతుర్థులు ఉంటాయి. ఒకటి కృష్ణ పక్ష చతుర్థి, రెండోది శుక్ల పక్ష చతుర్థి. ఈ శుక్ల పక్ష చతుర్థినే వినాయక చతుర్థి (Vinayak Chaturthi 2022) అంటారు. ఇది శ్రావణ మాసంలో  రావడంతో ఇది మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఇది ఈ సారి ఇవాళ అంటే ఆగస్టు 1న వచ్చింది. పైగా రవి యోగం కూడా ఏర్పడుతోంది. అంతేనే ఈరోజు శ్రావణ మూడో సోమవారం కూడా. ఇన్ని ఒకేసారి రావడం యాదృచ్ఛికం. ఈ రోజు వినాయకుడితోపాటు శివుడిని కూడా పూజించడం వల్ల తండ్రీకొడుకుల ఇద్దరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ ముహూర్తం
శ్రావణ వినాయక చతుర్థి తేదీ: 01 ఆగస్టు 2022, సోమవారం ఉదయం 4:18 నుండి ప్రారంభం
శ్రావణ వినాయక చతుర్థి ముగింపు తేదీ: 02 ఆగస్టు 2022, మంగళవారం ఉదయం 5:13 గంటలకు
గణపతి పూజకు అనుకూల సమయం: ఈరోజు ఉదయం 11.06 నుండి మధ్యాహ్నం 01.48 వరకు 
అభిజీత్ ముహూర్తం: ఈరోజు ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:41 వరకు
పరిఘ్ యోగం : జూలై 31న సాయంత్రం 07:11 నుండి ఆగస్టు 1వ తేదీ రాత్రి 07:03 వరకు
శివయోగం : ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 07:03 నుండి ఆగస్టు 2వ తేదీ సాయంత్రం 6:37 వరకు
రవియోగం: ఆగస్టు 1 ఉదయం 5:42 నుండి సాయంత్రం 4:6 వరకు


రవియోగం ప్రాముఖ్యత
జ్యోతిష్య శాస్త్రంలో రవి యోగాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు.  ఈ యోగంలో సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. రవియోగంలో గణపతిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 


Also Read: Anagaraka Yoga: అంగారక యోగంతో ఈ 5 రాశుల వారికి పొంచి ఉన్న ముప్పు.. ఆగస్టు 10 వరకు జాగ్రత్తగా ఉండాలి 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook