Tirumala News: తిరుమల తిరుపతి దేవస్థానంలో 20 మంది మహిళలు అన్యమత ప్రచారం చేస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.అన్యమతస్తులు అన్యమత ప్రచారం చేయడంలో అటవీశాఖ అధికారుల సహాయం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి నిజం ఎంత అనే కోణంలో విచారణ చేపట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక అందులో భాగంగానే అన్య మతస్తులు తిరుమల పరిసర ప్రాంతాలలో నిజంగానే రీల్స్ చేశారా? లేక మరేదైనా ప్రాంతంలో చేశారా? అనే అంశాలపై టిటిడి అధికారులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అటవీశాఖ అధికారులపై వస్తున్న ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. 


ఇకపోతే పాప వినాశనం వద్దకు వెళ్ళిన స్థానికులు సంబంధిత అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారట. అయితే రీల్స్ చేసిన మహిళలంతా కూడా పాప వినాశనం ప్రాంతంలోని హోటల్ వద్ద రీల్స్ చేసినట్లు పలువురు భావిస్తున్నారు. అయితే వారంతా కూడా అక్కడ కూలి పని చేసుకునే మహిళలు అన్నట్లు సమాచారం. 


ఇకపోతే పాప వినాశనం వద్ద అన్యమతస్తులైన మహిళలు ప్రచారాలు చేయడంతో అక్కడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ మహిళలను కొండకిందికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 


ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ కూడా దీనిపై విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారు కలియుగ దేవుడు మతంతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచంలో నలుమూలలో ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. 


అయితే ఇలాంటి పుణ్యక్షేత్రంలో కావాలనే కొంతమంది అన్యమత ప్రచారం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Also read: Air Pollution: విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు నిరవధిక సెలవు, ఎందుకంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.