Vastu Shastra: పూవులను దేవుళ్లకు సమర్పించే ముందు నీళ్లలో కడగాలా? పండితులు ఏం చెబుతున్నారో తెలుసా?
Vastu Shastra: హిందూమతంలో పూలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజలో కూడా పూలు లేనిదే పూర్తికాదు. వివిధ దేవుళ్లకు వివిధ రకాల పూలు సమర్పిస్తారు. అయితే, వాస్తు ప్రకారం దేవుడికి సమర్పించడానికి కూడా నియమం ఉంది.
Vastu Shastra: హిందూమతంలో పూలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజలో కూడా పూలు లేనిదే పూర్తికాదు. వివిధ దేవుళ్లకు వివిధ రకాల పూలు సమర్పిస్తారు. అయితే, వాస్తు ప్రకారం దేవుడికి సమర్పించడానికి కూడా నియమం ఉంది. దేవుళ్లకు వారికి ఇష్టమైన రంగుల పూలను మాత్రమే సమర్పిస్తారు. కానీ, ఈ పూలను సమర్పించే ముందు వాటిని నీళ్లలో కడిగి పెట్టాలా? లేదా అలాగే సమర్పించాలా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఇంట్లో వాడిన పూలను ఉంచరాదు. దీంతో ఆ ఇంట్లో తీవ్ర ఆర్థిక సంక్షభం వస్తుంది. పూలను దేవుళ్లకు సమర్పించిన మరునాడు ఉదయం తీసి శుభ్రం చేయాలి. అలాగే, అగరబత్తిలు, ధూపం వంటివి కూడా కాల్చిన కాసేపటి తర్వాత శుభ్రం చేయాలి.
ఇదీ చదవండి: మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ పొరపాటు చేస్తున్నారా? దరిద్రులవుతారు జాగ్రత్త..
అలాగే, వాస్తు ప్రకారం దేవుళ్లకు పూలను సమర్పిచే ముందు మొక్కల నుంచి తెంపిన వెంటనే సమర్పించాలి. కానీ, కొంతమంది పూలను నీళ్లలో కడిగి దేవుళ్లకు సమర్పిస్తారు. ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు.
మొదటినీటిలో కడిగి పూలను దేవుళ్లక సమర్పిస్తే వారికి కోపం వస్తుందట. ముందుగా జలదేవుడికి సమర్పించిన తర్వాత దేవుళ్లకు సమర్పించినట్లవుతుందట. అంతేకాదు ఈ పూలను దేవుళ్లకు సమర్పించడానికి కూడా సరైన సమయం ఉంది. పూలను కేవలం బ్రహ్మముహూర్తంలో మాత్రమే సమర్పించాలి. అందుకే కేవలం ఆ సమయంలోనే పూలు కోయాలి. ఆ వెంటనే దేవుడికి సమర్పించాలి.
ఇదీ చదవండి: ఈ ఒక్క శివలింగ దర్శనం 12 తీర్థాల పుణ్యాన్ని ఇస్తుంది.. ఎక్కడుందో తెలుసా?
దేవుళ్లకు సమర్పించే పూలు కొంతమంది ముందురోజు తీసుకువస్తారు. ఇలా చేయకూడదు. ఏరోజు పూలను ఆరోజే దేవుళ్లకు సమర్పించాలి. అలాగే రాత్రిపూట పూలు కోయకూడదు. సాయంత్రం సంధ్య సమయంలో కూడా పూలు కోయకూడదు. చెట్లకు నీరు కూడా పోయకూడదు.
మీరు దేవుళ్లకు పువ్వులు సమర్పిస్తే స్నానం చేసిన తర్వాత, పువ్వులను తెంచి, ఆపై వాటిని నేరుగా దేవునికి సమర్పించాలని గుర్తుంచుకోండి. ఆ తరువాత పూజలు చేయండి.
ఇలా పూలు, నైవేద్యం ఏది సమర్పించినా దేవుళ్లకు నేరుగా సమర్పించాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter