Shravana Masam 2022: హిందువులు పవిత్ర మాసంగా భావించే శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభమవుతోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది ఐదో నెల. వెస్టర్న్ క్యాలెండర్ ప్రకారం ప్రతీ ఏటా జూలై-ఆగస్టు నెలల్లో శ్రావణ మాసం వస్తుంది. శ్రవణ నక్షత్రంలో వచ్చే మాసం కాబట్టి దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో ప్రతీ సోమ, మంగళ, శుక్రవారాల్లో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా శివుడిని, మంగళగౌరీని, మహావిష్ణువును ఆరాధిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నార్త్ ఇండియా, సౌత్ ఇండియాల్లో వేర్వేరు తేదీల్లో శ్రావణ మాసం :


శ్రావణ మాస తేదీల విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. శ్రావణ మాస తేదీలు నార్త్ ఇండియాకు, సౌత్ ఇండియాకు వేర్వేరుగా ఉంటాయి. ఈ ఏడాది నార్త్ ఇండియాలో శ్రావణ మాసం జూలై 14న ప్రారంభమైంది. ఆగస్టు 12న ఇది ముగియనుంది. సౌత్ ఇండియాలో జూలై 29 నుంచి ఆగస్టు 27 వరకు శ్రావణ మాసం ఉండనుంది. అంటే.. సౌత్ ఇండియా కన్నా 15 రోజుల ముందుగానే నార్త్ ఇండియాలో శ్రావణ మాసం ప్రారంభమైంది.


శ్రావణ మాసం ప్రాముఖ్యత, పురాణ విశిష్ఠత : 


హిందూ పురాణాల ప్రకారం దేవతలు శ్రావణ మాసంలోనే క్షీరసాగర మథనాన్ని చేపట్టారు. క్షీరసాగర మథనం సందర్బంగా మొదట 14 రత్నాలు సముద్ర గర్భం నుంచి వెలువడ్డాయి. వాటిని దేవతలు, రాక్షసులు పంచుకున్నారు. కానీ ఆ తర్వాత సముద్ర గర్భం నుంచి వచ్చిన గరళం (హాలాహలం, విషం) మాత్రం ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఆ గరళం భూమిపై పడితే సర్వం నాశనమవుతుందని తెలిసి దేవతలు భయపడ్డారు. దీంతో దేవతలంతా కలిసి ఆ పరమేశ్వరుడి వద్దకు వెళ్లగా.. శివుడు గరళాన్ని తన కంఠంలో దాచాడు. ఆ గరళం వల్లే శివుడు నీలకంఠుడిగా మారాడు.  గరళం శివుడిలో తీవ్ర ఉష్ణాన్ని పుట్టించింది. ఆ వేడిని చల్లార్చేందుకు నెత్తిన గంగను ధరించాడు. ఇవన్నీ శ్రావణ మాసంలోనే జరిగినట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి.


శ్రావణ మాసంలో ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి :


శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం వ్రతం, మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతం చేస్తారు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం ఈ పూజలు చేస్తారు. సోమ, మంగళవారాల్లో ఉపవాస దీక్ష ఉండి శివుడిని, పార్వతీ దేవిని పూజిస్తారు. 


పూజ సమయంలో శివుడికి పాలాభిషేకం చేయాలి
పంచామృతం (పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె లేదా బెల్లం) సమర్పించాలి.
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళం, మారేడు కాయను సమర్పించాలి.
మెడలో రుద్రాక్ష ధరించి శివ మంత్రం పఠించాలి
మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి
సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, ధూమపానం, మాంసాహారం వంటివి తీసుకోవద్దు.


Also Read: Ramarao on Duty Twitter Review: రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' హిట్టా ఫట్టా.. ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..


Also Read: Horoscope Today July 29th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి దూరమైన బంధుమిత్రులు మళ్లీ దగ్గరవుతారు..


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook