Shravana Purnima 2022:  శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథిని శ్రావణ పూర్ణిమ అంటారు. ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమను (Shravana Purnima 2022) ఆగస్టు 11, గురువారం నాడు జరుపుకోనున్నారు. అంతేకాకుండా ఈ రోజునే సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకైన రాఖీపండుగను చేసుకుంటారు. శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ యోగం మరియు సౌభాగ్య యోగం అనే రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. శ్రావణ పూర్ణిమ తిథి, యోగ మరియు శ్రావణి పండుగ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రావణ పూర్ణిమ తేదీ 2022
పౌర్ణమి తేదీ ఆగస్టు 11 ఉదయం 09:34 నుండి ప్రారంభమై... ఆగష్టు 12వ తేదీ ఉదయం 05:58 వరకు ఉంటుంది. ఆగస్ట్ 12న సూర్యోదయానికి ముందే పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి శ్రావణ పూర్ణిమ ఆగష్టు 11న వస్తుంది. ఈ ఏడాది రక్షాబంధన్ ను కూడా ఆగస్టు 11న జరుపుకోనున్నారు.


2 శుభయోగాలు
శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ , సౌభాగ్య యోగాలు ఏర్పడుతున్నాయి.  ఉదయం నుండి మధ్యాహ్నం 03.32 వరకు ఆయుష్మాన్ యోగం ఉంటుంది. ఆ తర్వాత సౌభాగ్య యోగం మధ్యాహ్నం 03.32 నుండి మరుసటి రోజు ఉదయం 11.34 వరకు ఉంటుంది.


భద్ర సమయం
శ్రావణ పూర్ణిమ నాడు ఉదయం 09:34 నుండి సాయంత్రం 04:26 వరకు భద్ర సమయం ఉంటుంది. ఈ కాలంలో రాఖీ పండుగ జరుపుకోకూడదు. సాయంత్రం 04:26 తర్వాత మాత్రమే రాఖీ కట్టండి. సాయంత్రం సౌభాగ్య యోగంలో రాఖీ కట్టడం శుభప్రదం.


శ్రావణి పండుగ
శ్రావణ పూర్ణిమ నాడు ఉదయం శ్రావణి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున బ్రాహ్మణులు తమ పాత యాగ్యోపవీత్ అంటే జానేవును మార్చుకుంటారు. శ్రావణ పూర్ణిమ సందర్భంగా కొత్త దారం ధరిస్తారు. ఈ కర్మను ఉదయాన్నే చేస్తారు. అంటే ఉదయం ఆయుష్మాన్ యోగంలో శ్రావణి పండుగ జరుపుకుంటారన్న మాట.


Also Read: Venus Transit 2022: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి జాక్ పాట్! ప్రమోషన్ పక్కా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook