Venus Transit in Cancer On August 7 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మారుస్తుంటుంది. ఈ క్రమంలోనే 2022 ఈ రోజున (ఆగస్ట్ 7) ఉదయం 5:21 గంటలకు కర్కాటక రాశిలోకి శుక్ర గ్రహం ప్రవేశించింది. కర్కాటక రాశిలో శుక్రుని సంచారంతో ఆగష్టు రెండవ వారం ప్రారంభమయింది. శుక్రుడు ఆగస్టు 31 వరకు ర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ మార్పు అన్ని రాశి చక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. కర్కాటక రాశిలో సూర్యుడు మరియు శుక్రుని కలయిక మూడు రాశుల వారికి కలిసిరానుంది. ఆ రాశులు ఏవో ఓసారి తెలుసుకుందాం.
కర్కాటక రాశిలో సూర్యుడు మరియు శుక్రుని కలయిక మిథునం, కన్య, తుల రాశుల వారికి ప్రయోజనకరంగా మారనుంది. ఈ మూడు రాశుల వారు అన్ని పనులలో విజయం సాధిస్తారు. చాలా డబ్బు పొందుతారు. కుటుంబంతో కలిసి సరదాగా కాలం గడుపుతారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆగస్ట్ 7 నుంచి 31 వరకు మిథునం, కన్య, తుల రాశుల వారికి అంతా కలిసిరానుంది.
మిథునం:
మిథున రాశి వారికి సూర్యుడు, శుక్రుడు కలయిక చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు ఊహించని డబ్బు పొందవచ్చు. అన్ని రంగాల్లోని వారికీ అధిక ధనలాభం ఉంటుంది. కెరీర్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమయం వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది.
కన్య:
కర్కాటక రాశిలో శుక్రుడు, సూర్యుని కలయిక కన్య రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉండవచ్చు. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందవచ్చు. వ్యాపారులు పెద్ద డీల్స్ పొందుతారు. మీరు పాత పెట్టుబడి నుండి లాభం పొందవచ్చు. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.
తుల:
తుల రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రుడు మరియు సూర్యుని కలయిక తుల రాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. తుల రాశి వ్యక్తులు ఉద్యోగ పరంగా పెద్ద ప్రయోజనాన్ని పొందవచ్చు. కొత్త ఉద్యోగం పొందుతారు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి. శృంగారంను ఎంజాయ్ చేస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook