Shri Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడో తెలుసా? శుభ సమయం, పూజా విధానం
Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. దీని యెుక్క శుభ ముహూర్తం, పూజా విధానం గురించి తెలుసుకోండి.
Shri Krishna Janmashtami 2022: శ్రావణం తర్వాత భాద్రపద మాసం వస్తుంది. ఈ మాసంలోని భాద్రపద కృష్ణ పక్షం అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని చెబుతారు. హిందువులు శ్రీ కృష్ణ జన్మాష్టమిని చాలా వైభవంగా జరుపుకుంటారు. జన్మాష్టమి (Shri Kirshna Janmasthmi 2022) రోజున ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని పూజిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 18న కృష్ణ జన్మాష్టమిని జరుపుకోనున్నారు. దీని యెుక్క శుభ సమయం, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
శుభ సమయం
జన్మాష్టమి రోజున చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. అభిజిత్ ముహూర్తం ఆగస్టు 18 మధ్యాహ్నం 12:5 నుండి 12:56 వరకు ఉంటుంది. రాత్రి 8.41 గంటల నుంచి 8.59 గంటల వరకు ధ్రువ యోగం ఏర్పడనుంది.
పూజా విధానం
జన్మాష్టమి రోజున ఉదయాన్నే స్నానం చేసి.. చిన్ని కృష్ణుడిని అలకరించండి. దాని తర్వాత తిలకం దిద్దండి. ఈరోజున ఉపవాసం ఉండి...వ్రతాన్ని చేయండి. శ్రీకృష్ణుని మంత్రాలను జపిస్తూ..పూజను చేయండి. చివరగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని పంపిణీ చేయండి.
Also Read: Astro puja tips: ఈ 5 పూజా వస్తువులు చేజారి కింద పడ్డాయా? అయితే మీకు ఆపదలు తప్పవు..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook