Shri Ram Favourite Zodiac Sign: 500 ఏళ్ల నిరీక్షణ ముగిసిన తర్వాత అయోధ్యలో సోమవారం శ్రీ రాముడు కొలువుదీరాడు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు రామ్ లాలా విగ్రహ స్థాపన ప్రాణం ప్రతిష్ఠ జరిగింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఘట్టాన్ని భారతీయులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రత్యేక సందర్భంలో శ్రీరామునికి ఎంతో ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం. శ్రీ రాముడు విష్ణువు అవతారాల్లో ఒకరు. కాబట్టి ఆయన ఆశీర్వాదాలు కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాముడి అనుగ్రహం పొందే రాశులవారు:
మీన రాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మీన రాశిని బృహస్పతి గ్రహం పాలిస్తుంది. కాబట్టి ఈ గ్రహానికి శ్రీరాముడికి ప్రత్యేక సంబంధం ఉంటుంది.  కాబట్టి మీన రాశి వారికి రాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీరాముని అనుగ్రహం వల్ల జీవితంలో ఐశ్వర్యం పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి సమాజంలో ఉన్నత స్థానం, కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి.  


తులారాశి:
తులారాశి వారికి కూడా శ్రీరాముని ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడు లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశిని పాలించే శుక్రగ్రహానికి కూడా రాముతో దగ్గరి సంబంధం ఉంటుంది. కాబట్టి  ఈ రాశివారికి కూడా ఎల్లప్పుడు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఎక్కువగా రాముడి అనుగ్రహంతో వివిధ మతపరమైన, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అంతేకాకుండా ఉత్తన శిఖరాలకు చేరుకునేందుకు ప్రత్యేక సమయాలు పొందుతారు. 


Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


మిథున రాశి:
ఈ రాశివారిపై కూడా శ్రీరాముడి అనుగ్రహం ఎల్లప్పుడు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరి జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు సంక్షోభం లేదా ఆపద సమయంలో వీరిని శ్రీ రాముడు రక్షిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు ఆయన అనుగ్రహంతో జీవితంలో గొప్ప విజయాలు, కీర్తిని పొందుతారు.


కర్కాటక రాశి:
జ్యోతిష్య గణనల ప్రకారం..కర్కాటక రాశి వారు కూడా శ్రీరామునికి చాలా ప్రత్యేకంగా భావిస్తారు. రాముడి అనుగ్రహం ఈ రాశువారిపై ఎల్లప్పుడు ఉంటుంది. వీరు జీవితంలో ఎలాంటి పనులనైనా సులభంగా చేయగలుతారు. దీంతో పాటు శ్రీరాముని కృపతో తమ పనిల్లో దినదిన అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఎంత సంతోషంగా జీవిస్తారు.


Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter