Shukra Rahu Yuti 2023: మేష రాశిలో రాహు-శుక్ర కలయిక.. మార్చి 12 నుండి ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక
Shukra And Rahu Yuti: మేషరాశిలో రాహువు మరియు శుక్రుడు సంయోగం ఏర్పడింది. వీరిద్దరి కలయిక వల్ల మూడు రాశులవారు అపారమైన సంపదను పొందనున్నారు.
Shukra & Rahu Yuti 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిచక్రాలను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులు చేసుకుంటాయి. దీని ప్రభావం మానవ సమాజంపై ఖచ్చితంగా ఉంటుంది. నిన్న అంటే మార్చి 12న శుక్ర గ్రహం మేషరాశిలోకి ప్రవేశించింది. ఇప్పటికే రాహు అదే రాశిలో కూర్చుని ఉన్నాడు. మేషరాశిలో ఈ రెండు గ్రహాల కూటమి వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఈ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.
మేష రాశిచక్రం
రాహువు మరియు శుక్రుల కలయిక మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఆరోహణ ఇంట్లోనే ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ దక్కే అవకాశం ఉంది. మీ లవ్ లైవ్ బాగుంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే మంచి సమయం.
మిథున రాశిచక్రం
రాహు మరియు శుక్రుల కలయిక మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. దీని కారణంగా విదేశీ వ్యాపారం చేసేవారు భారీగా లాభాలను గడిస్తారు. మీ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. పాతపెట్టుబడులు లాభిస్తాయి. ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
మకర రాశిచక్రం
రాహు మరియు శుక్రుల సంయోగం మీకు ఆర్థికంగా లాభిస్తుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. దీంతో మీరు జీవితంలో అన్ని సుఖాలను పొందుతారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. మీరు ఆఫీసులో పెద్ద బాధ్యతలను తీసుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు.
Also Read: Panch Mahayog: ఏడు శతాబ్దాల తర్వాత పంచ మహాయోగం.. ఈరాశులకు చెప్పలేనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook