Oscars 2023 Award Winner Movies: అమెరికా లాస్ ఏంజిల్స్ డోల్బీ థియేటర్ వేదికగా ఆస్కార్ 2023 వేడుకలో అవార్డులు ప్రకటిస్తున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఇండియాకు తొలి ఆస్కార్‌ను "ది ఎలిఫెంట్ విస్పరర్స్" సినిమా అందిస్తే.. రెండవ ఆస్కార్ అవార్డును "ఆర్ఆర్ఆర్" సినిమాలోని "నాటు నాటు పాట" అందించింది.
95వ ఆస్కార్ అవార్డు కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఆస్కార్ 2023లో వివిధ సినిమాలు గెల్చుకున్న వివిధ అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి..
బెస్ట్ సౌండ్ విభాగంలో 'టాప్‌గన్' ఆస్కార్ గెల్చుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగరీలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' అవార్డు సాధించింది. బెస్ట్ ఎడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభంగాలో 'విమెన్ టాకింగ్' ఆస్కార్ గెల్చుకుంది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో 'ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్' చిత్రానికి మరో ఆస్కార్ లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగరీలో ఇదే చిత్రానికి మరో ఆస్కార్ లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు సైతం ఇదే సినిమాకు వరించింది. అంటే మొత్తం ఇప్పటి వరకూ నాలుగు ఆస్కార్ అవార్డుల్ని ఈ సినిమా కైవసం చేసుకుంది.
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో ఆస్కార్ అవార్డుని 'గిల్లెర్మోడెల్ టోరోస్ పినాకియో' కైసవం చేసుకుంది. బెస్ట్ డాక్యమెంటరీ ఫీచర్ కేటగరీలో 'నావల్నీ' ఆస్కార్ సాధించింది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగరీలో 'యాన్ ఐరిష్ గుడ్ బై' చిత్రం ఆస్కారం గెల్చుకుంది. బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో 'ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్' సినిమాకు ఆస్కార్ వరించింది. ఇక బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో 'బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్' చిత్రానికి అవార్డు దక్కింది.
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ,బెస్ట్ ప్రోడక్షన్ డిజైన్ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి. ఇక ఊహించినట్టే జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 22కు బెస్ట్ విజ్యువల్ ఎఫెక్ట్ అవార్డు లభించింది.
Also read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook