Shukra Gochar 2022: జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం బుధ గ్రహాన్ని గ్రహాలకు రాకుమారుడిగా పిలుస్తారు. బుధ గ్రహం రాశి సంచారం చేయడం వల్ల దాని ప్రభావం పలు రాశుల వారిపై పడే అవకాశాలు ఉన్నాయి. అయితే బుధుడు ఈ నెలలోనే మూడుసార్లు రాశుల సంచారం చేయనున్నాడు. డిసెంబర్ 3న బుధుడు వృశ్చిక రాశిలో నుంచి ధనస్సు రాశిలోకి సంచారం చేయగా డిసెంబర్ 28వ తేదీన మకర రాశిలోకి సంచారం చేయనన్నాడు. అంతేకాకుండా డిసెంబర్ 30న కూడా బుధ గ్రహం తిరోగమనం దిశగా ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ మూడు సంచారాల ప్రభావం 12 రాశుల వారిపై తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా పలురాశుల వారికి ఈ సంచారం శుభప్రదంగా మారబోతోంది. ఈ బుధ గ్రహ సంచారం వల్ల ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంచారం వల్ల ఫలితాలను పొందబోయే రాశుల వారు వీరే:


మేష రాశి:
మేషరాశి వారికి డిసెంబర్ నెల మొత్తం ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసే ఈ రాశి వారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్లో మంచి అవకాశాలు కూడా పొందుతారు. కాబట్టి భవిష్యత్‌ అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 


వృషభ రాశి:
బుద్ధుడి సంచారం తిరోగమనం కారణంగా వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలగనున్నాయి. గతంలో ఆగిపోయిన పనులన్నీ తీరుగామనం కారణంగా వేగంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఈ రాశి వారు విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ క్రమంలో ఉద్యోగాలు పొందే ఛాన్స్ కూడా ఉంది. ఈ సంచారం క్రమంలో కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.


సింహరాశి:
సింహరాశికి బుధ గ్రహ సంచారం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందడమే కాకుండా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్న వారు ఈ క్రమంలో ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులైతే ఈ సంచారం క్రమంలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. 


కన్యా రాశి:
బుధ సంచారం వల్ల కన్యా రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సంచారం కారణంగా కన్యా రాశి వారు కొత్త వస్తువులనుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సొంతింటి కలను నిజం చేసుకుంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్తారు. 


Also Read: North Korea: ఆమ్మో.. సినిమా చూశారని చిన్న పిల్లల్ని చంపేశారు.. దారుణ ఘటన వెలుగులోకి!


Also Read: Adah Sharma Hot Photos: బెడ్డెక్కి ఆదా శర్మ హాట్ ఫోజులు..అందాలన్నీ బహిర్గతం అయ్యేలా హాట్ ట్రీట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook