Shukra Gochar 2022: శుక్ర గ్రహం గోచారం ప్రారంభమైంది. సింహరాశిలో శుక్రుడి ప్రవేశంతో సూర్య, శుక్రగ్రహాల కలయిక జరిగింది. ఫలితంగా మూడు రాశుల జాతకం మారిపోనుంది. కెరీర్, సంపద అన్నీ లభించనున్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం సింహరాశిలో శుక్రుడు ప్రవేశించాడు. అప్పటికే సింహరాశిలో సూర్యుడు ఉండటంతో..సూర్య, శుక్ర గ్రహాల కలయిక సాధ్యమైంది. ఫలితంగా కొన్ని రాశులకు అదృష్టం వరించనుంది. శుక్రుడి రాశి పరివర్తనంతో జాతకరీత్యా కీలకమార్పులు జరగనున్నాయి. సూర్యుడు ఇప్పటికే సింహరాశిలో ఆశీనుడై ఉన్నాడు. జ్యోతిష్యశాస్త్రంలో ఈ విధంగా సూర్యుడు గురువుగా ఉన్న సింహరాశిలో సూర్య శుక్ర గ్రహాల కలయిక మహత్యం కలదిగా భావిస్తున్నారు. 


సూర్య, శుక్ర గ్రహాల యుతి ప్రభావం 12 రాశులపై స్పష్టంగా పడనుంది. ముఖ్యంగా 3 రాశులవారికి అదృష్టం వరించనుంది. సూర్య, శుక్ర గ్రహాల యుతి 3 రాశులకు అత్యంత లాభదాయకం కానుంది. రానున్న 15 రోజుల్లో భారీగా లాభాలు, ప్రయోజనాలు కలగనున్నాయి. శుక్ర గోచారం , సూర్య శుక్ర గ్రహాల యుతి కారణంగా ఏ రాశుల అదృష్టం మారుతుందో చూద్దాం..


వృషభరాశి వారిపై..శుక్ర గోచారం, సూర్య శుక్ర గ్రహాల యుతి శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. కెరీర్‌లో కీలక విజయం సాధిస్తారు. పదోన్నతి, జీతం పెరగడం ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఏదైనా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 


సింహరాశిలో సూర్య, శుక్ర గ్రహాల యుతి జరుగుతోంది. దీని ఫలితం సింహరాశి జాతకులపై విశేషంగా ఉండనుంది. ఈ జాతకులకు ఆకస్మికంగా డబ్బు అందుతుంది. డబ్బులు వచ్చే మార్గాలు తెర్చుకుంటాయి. డబ్బులు వచ్చే మార్గాలు తెర్చుకుంటాయి. ఫలితంగా ఆర్ధిక పరిస్థితి పటిష్టమౌతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి.


తులరాశికి గురువు శుక్రుడు. సూర్య, శుక్ర గ్రహాల యుతి కారణంగా తుల రాశి జాతకులకు భారీగా లాభాలు కలుగుతాయి. ఈ జాతకుల ఆదాయం పెరుగుతుంది. జీతం పెరిగే అవకాశాలున్నాయి. డబ్బులు సంపాదించేందుకు మార్గాలుంటాయి. పెద్ద పెద్ద శాలరీ ప్యాకేజ్ ఉండే ఉద్యోగావకాశాలు లభిస్తాయి.


మొత్తానికి శుక్రుడి రాశి పరివర్తనంతో  సింహం, వృషభం, తులా రాశి జాతకులకు సెప్టెంబర్ 15వ తేదీ వరకూ తిరుగే ఉండదు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. 


Also read: Vastu Tips for Money: ఇంట్లో పారిజాతం మెుక్కను ఈ దిశలో నాటండి.. ధనవంతులు అవ్వండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook