Vastu Tips for Money: ఇంట్లో పారిజాతం మెుక్కను ఈ దిశలో నాటండి.. ధనవంతులు అవ్వండి!

Vastu Tips for Money: అపారమైన సంపదను పొందాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం. ఇంట్లో సరైన దిశలో పారిజాత మొక్కను నాటితే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2022, 01:22 PM IST
Vastu Tips for Money: ఇంట్లో పారిజాతం మెుక్కను ఈ దిశలో నాటండి.. ధనవంతులు అవ్వండి!

Parijat Plant at Home: పారిజాతం అనేది అరుదైన మెుక్క. దీని గురించి పురాణాలలో  కూడా చెప్పబడింది. శ్రీకృష్ణభగవానడు ఈ పారిజాత పుష్పాన్ని స్వర్గలోకము నుండి దొంగలించడానికి ప్రయత్నించి ఇబ్బందుల్లో పడతాడు. ప్రపంచంలో ఏ మెుక్కకు (Parijata) లేని విశిష్టత ఈ చెట్టుకు ఉంది. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి ఐదు వేళ్లను పోలి ఉండటంతోపాటు పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. ఈ పారిజాత పుష్పాలు తెలుపు రంగులో ఉంటాయి.

వాస్తు శాస్త్రంలో పారిజాత పుష్పానికి (Vastu tips for Parijata) చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పుష్పాలు సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. అందుకే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామరపువ్వులతో పాటు ఈ పారిజాత పుష్పాలను కూడా ఉంచుతారు. ఈ మెుక్క ఇంట్లో ఉండటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి.. అష్టఐశ్వర్యాలతో వెల్లివిరుస్తాయి. ఈ చెట్టు దీర్ఘాయువును ఇస్తుందని నమ్ముతారు.పారిజాత మెుక్క ప్రయోజనాలు పొందాలంటే దానిని సరైన దిశలో నాటాలి.

ఈ దిశలో నాటండి..
>> పారిజాత మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటడం మంచిది. ఇది ఇంటి ప్రతికూలతను తొలగిస్తుంది. దీనితో పాటు ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తుంది. ఈ మొక్కను ఇంటికి పడమర దిశలో కూడా నాటవచ్చు.
>> ఇంటి ఆవరణలో పారిజాత మొక్కను నాటడం వల్ల అపార సంపదలు చేకూరడంతో పాటు పాపాల నుండి విముక్తి లభిస్తుంది.
>> ఇంటి పూజ మందిరం దగ్గర పారిజాతం లేదా హరసింగార్ మొక్కను నాటడం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది.
>> యమ దిక్కు కనుక ఇంటికి దక్షిణం దిక్కున ఎట్టిపరిస్థితుల్లోనూ పారిజాత మొక్కను నాటకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల లాభానికి బదులు హాని కలుగుతుంది.

Also Read: Astro Tips: మీ దురదృష్టం కూడా అదృష్టంగా మారాలంటే...రోజూ ఈ 5 పనులు చేయండి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News