Venus Planet Transit In Mesh: గ్రహాల గమనంలో మార్పు కొందరికి శుభకరంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మార్చి 12న మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు డబ్బు మరియు పురోభివృద్ధి సాధిస్తారు. శుక్రుడి గోచారం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మిథున రాశిచక్రం
శుక్రుని సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి ఆదాయ స్థానానికి రాబోతున్నాడు. దీని కారణంగా మీ ధనం రెట్టింపు అవుతుంది. పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. పార్టనర్ షిప్ చేసే వ్యాపారంలోమీరు మంచి లాభాలను గడిస్తారు. మీరు ఈ కాలంలో స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం.
మేష రాశిచక్రం
శుక్రుని రాశి మార్పు మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ సంచార జాతకంలో లగ్న గృహంలో సంచరిస్తుంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. శుక్ర గ్రహం మీ సంపద మరియు ఏడవ ఇంటికి అధిపతి. దీని కారణంగా మీకు ఆకస్మాత్తుగా డబ్బు వస్తుంది. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 
ధనుస్సు రాశిచక్రం
శుక్రుని సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి ఐదవ ఇంట్లో సంచరిస్తుంది. దీంతో మీకు ధనప్రాప్రి కలుగుతుంది. మీ కాపురం బాగుంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు మంచి లాభాలు సాధిస్తారు. మీ కెరీర్ ఇంతకముందు కంటే బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.


Also Read: Guru Gochar 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న గురుడు.. ఈ మూడు రాశులపై కనకవర్షం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook