Shukra Gochar 2024 In Virgo: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధ, శుక్ర గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాలను మిత్రగ్రహాలుగా చెప్పుకుంటారు. ఈ రెండు గ్రహాలు కన్యా రాశిని పరిపాలిస్తారు. అంతేకాకుండా అధిపతిగా వ్యహరిస్తాయి. అయితే శుక్రగ్రహం ఎంతో ప్రాముఖ్యత కలిగిన కన్యారాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారం ఆగస్టు 24వ తేదిన జరగబోతోంది. ఇప్పటికే అదే గ్రహంలో కేతువు గ్రహం కూడా ఉంది. అయితే ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో.. లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
వృశ్చిక రాశి:

కన్యా రాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల వృశ్చిక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా శుక్రుడి అనుగ్రహంతో వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. దీంతో పాటు గతంలో నిలిచిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా డబ్బులు కూడా సులభంగా తిరిగిస్తాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే అతి త్వరలోనే కొన్ని గుడ్‌ న్యూస్‌లు కూడా వింటారు. అంతేకాకుండా అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


సింహ రాశి:
సింహ రాశివారికి శుక్రుడి సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి జీవితంలో వస్తున్న ప్రతి సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే వీరికి సౌఖ్యం కూడా పెరుగుంది. అలాగే ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధించేందుకు అద్భుతమైన శక్తిని పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం అనుకున్న ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు కుటుంబ జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. 


మీన రాశి:
మీన రాశివారికి శుక్రుడి సంచార సమయంలో విశేష ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా మీన రాశివారికి జీవితంలో ఒక్కసారిగా సంతోషం పెరుగుతుంది. అలాగే శుక్రుడి ప్రభావంతో ఐశ్వర్యం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే జీవనోపాధిలో అనేక మార్పులు వస్తాయి. దీంతో పాటు స్నేహితుల సపోర్ట్ కూడా లభిస్తుంది. దీని కారణంగా అనుకున్న పనులు సులభంగా చేసి, ఆర్థికంగా బోలెడు లాభాలు పొందుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.