Venus transit 2023: శుక్రుని సంచారంతో ఈ 3 రాశుల జీవితాల్లో కీలక మార్పులు.. మీరున్నారా?
Venus transit 2023: కాలానుగుణంగా గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు రీసెంట్ గా రాశిని మార్చాడు. శుక్రుడి గోచారం కొందరి జీవితాలను నాశనం చేయనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar Effects: ఆస్ట్రాలజీలో శుక్రుడిని చాలా శుభ గ్రహంగా భావిస్తారు. లవ్, రొమాన్స్, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై ఊహించనంత ప్రభావాన్ని చూపుతుంది. రీసెంట్ గా శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడి సంచారం కొందరి జీవితాల్లో గందరగోళం సృష్టించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
శుక్రుడి సంచారం ఈ రాశులకు నరకం
కర్కాటకం- శుక్రుని సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, దానిని చూసి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ లగ్జరీ లైఫ్ కోసం కొత్త వస్తువులను ఇంటికి తీసుకువచ్చే అవకాశం ఉంది. లవర్స్ మధ్య బంధం ఇంకా గట్టిపడుతుంది.
ధనుస్సు - శుక్రుని రాశి మార్పు భార్యభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. అయితే ఒక్కోసారి దంపతుల మధ్య విభేదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. సమాజంలో మీరు గౌరవం కోల్పోయే అవకాశం ఉంది. మీ పనిలో తరుచూ ఆటంకాలు ఏర్పడతాయి.
మీనరాశి - మిథునరాశిలో శుక్రుని సంచారం వల్ల మీరు కొన్ని సమస్యల బారిన పడతారు. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ లైఫ్ పార్టనర్ తో గొడవలు వస్తాయి. వ్యాపారులు భారీగా నష్టపోతారు. మీ కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. అయితే ఈ టైంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Sun Transit 2023: మరో 10 రోజుల్లో ఈరాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook