Venus Transit: సెప్టెంబర్ 24న కన్యారాశిలోకి శుక్రుడు.. దీపావళికి ముందు ఈ 6 రాశుల ఆదాయం పెరగడం ఖాయం!
Venus Transit 2022: సెప్టెంబర్ 24న శుక్రుడు కన్యారాశిలో సంచరించనున్నాడు. దీని ప్రభావం కారణంగా కొంత మంది ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది.
Venus Transit 2022: దీపావళికి ముందు గ్రహ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ధన, వస్తు సౌఖ్యాలకు సంబంధించిన గ్రహమైన శుక్రుడు కన్యారాశిలోకి (Venus Transit in Virgo 2022) ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబరు 24న ఈ శుక్ర సంచారం జరగనుంది, దీని ప్రభావం వల్ల వచ్చే నెలలో కొన్ని రాశులవారి ఆదాయం ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. దీపావళి పండుగకు ముందు ఈ వ్యక్తులు చిక్కుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. మరి ఈ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
వృషభరాశి (Taurus): శుక్ర సంచారం ఈరాశి వారి కెరీర్ లో కొత్త అవకాశాలను అందుకునేలా చేస్తుంది. సంపాదనలో పెరుగుదల ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీలో సృజనాత్మకత పెరుగుతుంది.
సింహరాశి (Leo): శుక్రుడి రాశి మార్పు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. వివిధ వనరులు ద్వారా వీరికి ఆదాయం వస్తుంది. వ్యాపారంలో భారీ లాభాలను పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఒత్తిడి లేకుండా జీవిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో మీరు మీ డబ్బును నగలు, బట్టలు, ఇతర వస్తువులు కొనడానికి వెచ్చిస్తారు. ఈ సమయంలో లవర్స్ సంతోషకరమైన క్షణాలను గడుపుతారు.
కన్యారాశి (Virgo): ఈ రాశిలోనే శుక్ర సంచారం జరగబోతుంది కాబట్టి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు భారీగా డబ్బును సంపాదిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో మీకు మంచి అవకాశాలు వస్తాయి.
వృశ్చిక రాశి (Scorpio): శుక్ర సంచార సమయంలో ఈ రాశివారు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుర్రాళ్లు తమ ప్రేమలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో విజయం ఉంటుంది. శుక్రాచార్యుడి అనుగ్రహం వల్ల సమాజంలో మీ గుర్తింపు పెరుగుతుంది
మకరరాశి (Capricorn): ఈ రాశి వారు జీవితంలోని అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఊహించని ధనం మీకు అందుతుంది. జాబ్ మారాలనుకునే వారికి ఈ సమయం బాగుంటుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి.
Also read: Surya Gochar 2022: రేపు రాశి మారబోతున్న సూర్యుడు.. ఈ 4 రాశులవారికి జాక్ పాట్.. మీరున్నారా మరీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook