Shukra Rashi Parivartan 2023: అంతరిక్షంలో గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. ఎవరి జాతకంలో గ్రహాలు శుభస్థానంలో ఉంటాయో ఆ వ్యక్తికి దేనికీ  లోటు ఉండదు. ఆనందం మరియు ఐశ్వర్యం ఇచ్చే శుక్రుడు జనవరి 22న కుంభరాశిలో సంచరించనున్నాడు. ఇప్పటికే శనిదేవుడు అదే రాశిలో సంచరిస్తున్నాడు. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు అశుభ స్థానంలో ఉంటే వారికి ఎటువంటి భౌతిక సుఖాలు లభించవు. కుంభంలో శుక్ర-శనిదేవుడి కలయిక వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు ప్రయోజనం
మేషరాశి (Aries): కుంభరాశిలో శుక్రుని సంచారం మేషరాశి వ్యక్తుల జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. ఉద్యోగ మరియు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీరు పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. 
మిధునరాశి (Gemini): శుక్ర సంచారం వల్ల మీకు ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


కర్కాటకం (Cancer): కుంభరాశిలో శుక్రుని సంచారం కర్కాటక రాశివారి జీవితంలో శుభ ఫలితాలను తెస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. 
వృశ్చికరాశి (Scorpio): ఈ సమయం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో  సంతోషంగా ఉంటుంది. వృశ్చికరాశివారు ఆర్థికంగా బలపడతారు. మీకు మిత్రుల మద్దతు లభిస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. 


Also Read: Shani Asta 2023: కుంభరాశిలో అస్తమించబోతున్న శనిదేవుడు.. వీరి కెరీర్ దూసుకుపోవడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook