Shukra Rashi Parivartan 2022: డిసెంబర్ నెల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైనది. ఇదే నెలలో చాలాగ్రహాలు ఇతర రాశుల్లోకి సంచారం చేయబోతున్నాయి ముఖ్యంగా డిసెంబర్ 5న శుక్రుడు మకర రాశి వదిలి ధనస్సురాశిలోకి సంచారం చేశాడు. జ్యోతిష శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ సంచారం కారణంగా ప్రతి రాశిపై ప్రభావం పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర పేర్కొన్నారు. ఏ రాశి వారి లగ్నంలో శుక్రుడు ఉన్నాడో ఆ రాశి వారిపై చాలా ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఈ సంచారం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ క్రింది రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
 
 ఈ రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. మేష:
శుక్రుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల మేష రాశి వారికి చాలా రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు వ్యాపారాల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి లాభాలు కూడా పొందుతారు. ఈ రాశి వారు ప్రయాణాలు చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ మేష రాశి వారు డబ్బు విషయంలో పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. 


2. కన్య:
ఈ సంచారం వల్ల కన్యా రాశి వారికి జీవితంలో ఆనందం చేకూరుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయత పెరిగే అవకాశాలున్నాయి. ఈ సంచారం ప్రభావంతో ఈ రాశి వారు ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా వీరు ట్రావెలింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


3. వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి శుక్ర సంచారం వల్ల అన్ని ఆర్థిక ప్రయోజనాలే కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంటుంది. ఈ ప్రభావంతో ఏ రంగంలో పనులు చేసిన విజయాలు సాధిస్తారు.


4. ధనుస్సు:
ధనస్సు రాశి వారు ఈ సంచారం ప్రభావంతో అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సభ్యుల నుంచి మద్దతు లభించి సంతోషంగా ఉంటారు.


Also Read : Anasuya Bharadwaj : నన్ను నమ్మండి.. డబ్బుల కోసం నేను అవి చేయను.. అనసూయ కామెంట్స్ వైరల్


Also Read : Jabardasth Sujatha : సుజాత అతి చేష్టలు.. రాకేష్‌తో చెట్టాపట్టాలేసుకుంటూ.. నెటిజన్ల సెటైర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook