Zodiac Sign 2024: జూలైలో రాహువు - శని కలయిక.. ఈ 3 రాశుల వారికి తిరుగులేదు.. డబ్బే డబ్బు..

Rahu and Saturn Conjunction: రాశుల సంచారాల పరంగా జూలై నెల ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే ఈ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం, సంయోగం చేయబోతున్నాయి దీనికి కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 25, 2024, 10:15 AM IST
Zodiac Sign 2024: జూలైలో రాహువు - శని కలయిక.. ఈ 3 రాశుల వారికి తిరుగులేదు.. డబ్బే డబ్బు..

 

Rahu and Saturn Conjunction: రాశి సంచారాలకు గ్రహ సంయోగాలకు జూలై నెల ఎంతో కీలకం కాబోతోంది. అందుకే ఈ నెలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకోబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ నెలలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం కూడా చేయబోతున్నాయి. ముఖ్యంగా కీడు గ్రహాలుగా చెప్పుకోబోయే రాహు, శని రెండు గ్రహాలు ఇదే సమయంలో సంయోగం చేయబోతున్నాయి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు గ్రహాల సంయోగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా ఈ సంయోగాన్ని కీడుగా కూడా పరిగణిస్తారు. రాహువు ప్రస్తుతం మీనరాశిలో ఉండగా.. ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని నక్షత్రమైన ఉత్తరాభాద్రపాదంలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారం జులై 8వ తేదీన తెల్లవారి జామున 4 గంటలకు జరగబోతోంది. అయితే ఈ సంయోగం కారణంగా ఏయే రాశుల వారికి ఇలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తులారాశి: 
రాహు నక్షత్ర సంచారం కారణంగా తులా రాశి వారి వ్యక్తిగత జీవితంలో ఆకస్మిక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరుల లభించడమే కాకుండా ఆర్థికంగా ఎంతగానో మెరుగుపడతారు. అలాగే శత్రువుల నుంచి వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి.  ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండా ఆర్థికంగా ఎంతగానో మెరుగుపడతారు. అలాగే శత్రువుల నుంచి వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా అభివృద్ధి పదంగా సేవ చేస్తున్న వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అయితే వీరు ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశి వారికి కూడా ఈ నక్షత్ర సంచారం ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో వ్యక్తిగత జీవితం లాభదాయకంగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా ఎంతో బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో పొందాలనుకుంటున్నా ఆస్తులు కూడా సులభంగా పొందుతారు.. దీంతోపాటు వీరు ఆకస్మిక ధన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు ఆర్జించే ఛాన్స్ ఉంది. అయితే వీరు కూడా ఆరోగ్యంపై జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృషభ రాశి: 
వృషభ రాశి వారు కూడా ఈ సమయంలో అనేక లాభాలు పొందుతారు. ముఖ్యంగా వీరికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన ఎంతో సింపుల్‌గా విజయాలు సాధిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఇంక్రిమెంట్స్‌తో పాటు ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అలాగే ఈ సమయంలో వీరి కొన్ని శుభవార్తలు కూడా వినయ్ అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఎప్పటినుంచి వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News