Venus Transit in Leo 2023: ఆస్ట్రాలజీలో అందం, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని పేర్కొంటారు. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న శుక్రుడు.. జూలై 07న సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శుక్రుడి గోచారం వల్ల మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
తులారాశి
సింహరాశి యెుక్క ఆదాయ గృహంలో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీంతో తులరాశి వారు వృత్తి మరియు వ్యాపారం రెండింటిలోనూ ప్రయోజనం పొందనున్నారు. ఈ రాశి వారు ఆర్థికంగా కూడా లాభపడనున్నారు. వివిధ మార్గాల ద్వారా మీరు ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు బెట్టింగ్, లాటరీ మరియు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు. 
వృషభం
శుక్రుని రాశిలో మార్పు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈరాశి వారి జాతకంలోని నాల్గవ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీని కారణంగా వృషభరాశి వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. రియల్ ఎస్టేట్, పుడ్ కు సంబంధించిన వ్యాపారం చేసే వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది.


Also Read: Shash Rajyog benefits: మరో ఆరు రోజుల్లో 'శష్ రాజయోగం'.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..


సింహరాశి 
శుక్రుడు సింహరాశి యెుక్క లగ్న గృహంలో సంచరించబోతున్నాడు. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు అన్ని పనులలో మంచి ఫలితాలను పొందుతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.


Also read: Shani Vakri 2023: రివర్స్‌లో కదలనున్న శని-రాహు-కేతువు.. రాబోయే 6 నెలలపాటు ఈ 4 రాశులకు కష్టాలే కష్టాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook