Shani-Rahu-Ketu Vakri 2023: మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 17న శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఇదే స్థితిలో వచ్చే ఆరు నెలలపాటు ఉండనున్నాడు. శనితోపాటు మరో రెండు గ్రహాలైన రాహు-కేతువులు కూడా అక్టోబరు వరకు వ్యతిరేక దిశలో కదలనున్నాయి. రాబోయే 6 నెలల్లో ఈ గ్రహాల రివర్స్ కదలిక వల్ల నాలుగు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేవో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
శనితో పాటు రాహు-కేతువుల తిరోగమనం కారణంగా కర్కాటక రాశి వారు రాబోయే 6 నెలల పాటు చాలా సమస్యలను ఎదుర్కోంటారు. కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. ఆర్థికంగా కూడా కలిసిరాదు. అప్పులు పెరిగి మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉద్యోగంతోపాటు కుటుంబ జీవితంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
సింహరాశి
ఈ 3 గ్రహాల వ్యతిరేక కదలిక సింహరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో ఎక్కడికి వెళ్లినా మీకు మానసిక ప్రశాంతత లభించదు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారులకు లాభాలు ఉండవు. కోర్టు కేసుల్లో టెన్షన్ పడతారు.
Also Read: Shash Rajyog benefits: మరో ఆరు రోజుల్లో 'శష్ రాజయోగం'.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి రాబోయే 6 నెలలు చాలా కష్టతరంగా ఉండబోతున్నాయి. మీరు కెరీర్, ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. వ్యాపారులు నష్టాలను చవిచూస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎటువంటి లావాదేవీలు చేయవద్దు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
మీనరాశి
మీనరాశి వారిపై శని సడేసతి మెుదటి దశ కొనసాగుతోంది. మూడు గ్రహాల తిరోగమనం వల్ల ఈరాశి వ్యక్తులు మానసిక మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది, దీని వల్ల మీరు భారీగా డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Also Read: Mercury transit 2023: ఏడాది తర్వాత మిథునరాశిలోకి బుధుడు... ఈ 3 రాశుల వారిని వరించనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook