Venus Transit Shukra Rashi Parivartan 2023: మాఘ శుక్ల పక్ష ప్రతిపద తిథి రోజున శుక్ర, శని గ్రహాలు కుంభరాశిలోకి సంచారం చేశాయి. అయితే ఈ సంచారం ప్రభావం వల్ల కొందరి రాశుల్లో ఫిబ్రవరి 15 వరకు మార్పులు చేర్పులు జరుగుతాయి. శుక్రుడు, శనితో సఖ్యత ఏర్పడి రాశులకు శుభ, అశుభాలను కలిగిస్తాడు. జ్యోతిష్యం శాస్త్ర ప్రకారం.. వృషభ, కర్కాటక రాశి వారికి శని పదవ స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. కాబట్టి శని ప్రభావం ఆ రెండు రాశుల వారిపై పడి ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభరాశిలోనే శనితోపాటు శుక్రుడు ఉండడంతో పై రాశుల వారి జీవితాల్లో ఆనందం లభించి.. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు అయితే ఈ క్రమంలో తప్పకుండా ఈ రాశుల వారు కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది..ఆ పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


కన్య రాశి: 
కన్య రాశి శని శుక్ర గ్రహాలకు ఆరవ స్థానంలో ఉంటుంది.. కాబట్టి ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ సంచార ప్రభావంతో ప్రయాణాలు కూడా చేస్తారు. అయితే ఈ ప్రయాణాల్లో ఖర్చులు భారీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కన్యా రాశి వారికి దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ క్రమంలో కంటి సమస్యలు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు కోపాన్ని తప్పించుకోవడం చాలా మంచిది లేకపోతే తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ కింది పరిహారం పాటించండి. 


పరిహారం :- మీ జాతకం ప్రకారం.. ఒపల్ లేదా డైమండ్ రత్నాన్ని ధరించండి.


తుల రాశి:
కుంభ రాశిలో శని శుక్రుడి కలయికల వల్ల తులా రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారు సంచార ప్రభావంతో వ్యాపారాన్ని విస్తీర్ణపరచుకుంటారు. అంతేకాకుండా ఆదాయ వనరులు పెరిగి ఊహించని లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలు రాసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. క్రమంలో పోటీ పరీక్షలు రాస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ రాశి వారు సంచార ప్రభావం వల్ల కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అంతే కాకుండా పరిహారాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది.


పరిహారం :- జ్యోతిష్య శాస్త్ర నిపుణుని సంప్రదించి వేలికి డైమండ్ రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు


ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook