Shukra Transit 2022: త్వరలో ధనుస్సు రాశిలోకి శుక్రుడు... వీరికి మంచి రోజులు ప్రారంభం...
Shukra Transit 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్రుడు బృహస్పతి రాశి అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుక్ర సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Shukra Planet Transit In Dhanu: డిసెంబరులో వీనస్ ప్లానెట్ ట్రాన్సిట్ జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆస్ట్రాలజీలో శుక్రుడు సంపద, కీర్తి మరియు ఆనందానికి కారకుడిగా భావిస్తారు. అందుకే శుక్రుని సంచారం (Venus transit in Sagittarius 2022) అన్ని రంగాలవారిపై ఖచ్చితంగా ఉంటుంది. శుక్ర గ్రహం డిసెంబర్ 5న ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ధనుస్సు రాశిలో శుక్రుడి సంచారం ఈ 3 రాశులకు శుభప్రదంగా ఉంటుంది.
తుల (Libra): శుక్ర గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ జాతకంలో మూడవ ఇంట్లో సంచరిస్తుంది. దీంతో మీ ధైర్యం పెరుగుతుంది. డబ్బు ఆదా చేయడం మెుదలుపెడతారు. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. సోదరసోదరీమణుల మద్దతు మీకు లభిస్తుంది.
మేషం (Aries): శుక్రుని రాశి మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి.
మిథునం (Gemini): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుని రాశి మార్పు మీకు సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి ఏడవ ఇంటిలో సంచరించబోతోంది. భాగస్వామ్యంతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. మీకు జీవిత భాగస్వామి యొక్క సపోర్టు లభిస్తుంంది. వ్యాపారంలో భారీగా డబ్బు సంపాదిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
Also Read: Guru Margi 2022: మీన రాశిలోకి బృహస్పతి గ్రహం ఈ రాశువారి అన్ని నష్టాలే.. ఎందుకో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి