Guru Margi 2022: మీన రాశిలోకి బృహస్పతి గ్రహం ఈ రాశువారి అన్ని నష్టాలే.. ఎందుకో తెలుసా..?

Guru Margi 2022: అన్ని గ్రహాలు ఏదో ఒక సమయంలో రాశులు మారుతూ ఉంటాయి ఈ రాశులు మారడాన్నే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంచారమని అంటారు ఈ సంచారం వల్ల వ్యక్తుల జీవితాల్లో తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 05:50 PM IST
Guru Margi 2022: మీన రాశిలోకి బృహస్పతి గ్రహం ఈ రాశువారి అన్ని నష్టాలే.. ఎందుకో తెలుసా..?

Guru Margi 2022: బృహస్పతి గ్రహం ఏప్రిల్ 13న మీనంలోకి ప్రవేశించింది. జూలై 24 న ఈ రాశిలో తిరోగమనంలో చాలా రకాల మార్పులు కూడా సంభవించాయి. దీని కారణంగా చాలా రాశువారికి ప్రయోజనాలు కలిగాయి. అయితే బృహస్పతి తన సొంత రాశి అయిన  మీన రాశిలో నవంబర్ 24 ఉదయం 4.27 గంటలకు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా అన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు వచ్చే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ క్రమంలో సంచారం వల్ల పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అయితే సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
 
ఈ రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి:

కుంభ రాశి: 
కుంభ రాశి వారికి బృహస్పతి గ్రహం రెండవ స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితిలు కూడా మెరుగుపడతాయి. కాబట్టి ఈ రాశివారు సంచారం క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో  బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. 

ధనుస్సు రాశి: 
ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో బృహస్పతి ఉండబోతున్నాడు కనుక వీరి జీవితాల్లో కూడా మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ రాశి వారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల పాలవుతారు. అంతేకాకుండా ఆఫీసుల్లో తీవ్ర ఒత్తిడికి గురయ్య అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ధనస్సు రాశి వారు డ్రైవింగ్ చేసే క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితుల విషయానికొస్తే ఈ రాశి వారు మంచి మంచి ప్రయోజనాలతో పాటు లాభాలు కూడా పొందుతారు.

తులారాశి:
ఈ సంచారం వల్ల తులా రాశి వారికి బృహస్పతి ఏడవ స్థానంలో ఉండబోతున్నాడు. ఈ స్థానం ఈ రాశి వారికి చాలా రకాల దుష్ప్రభావాలను కలగజేయొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించడం కూడా చాలా మంచిదని వారు చెబుతున్నారు. ఈ సంచారం క్రమంలో శత్రువుల పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో ప్రతిరోజు దేవుళ్లను పూజించాల్సి ఉంటుంది. 

సింహరాశి:
ఈ సంచారం వల్ల సింహ రాశి వారు కూడా తీవ్ర దుష్ప్రభావాల గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. కాబట్టి ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే ఇది సరైన సమయం అస్సలు కాదు.. ఏదైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కొంచెం వాటిపై సిద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కష్టపడాల్సి ఉంటుంది. 

Also Read: Minister Malla Reddy: మహేందర్ రెడ్డికి అస్వస్థత.. తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు   

Also Read: Delhi Murder: ఢిల్లీలో మరో దారుణం.. తండ్రి, అక్కాచెల్లెళ్లు, బామ్మను హత్య చేసిన యువకుడు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News