Shukra Gochar 2022: డిసెంబర్ 5న ధనుస్సు రాశిలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి ఇక తిరుగుండదు..
venus transit december 2022: శుక్ర గ్రహం డిసెంబరు 5న తన రాశిని మార్చి ధనుస్సు రాశిలో సంచరించబోతున్నాడు. ఈ శుక్రుని సంచారం కొన్ని రాశుల అదృష్టాన్ని మార్చనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
venus transit december 2022: వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఇతడు లవ్, రొమాన్స్, మనీ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడు. అంతేకాకుండా వృషభం మరియు తులారాశికి శుక్రుడు అధిపతి. ఆస్ట్రాలజీ లెక్కల ప్రకారం, వచ్చే నెలలో శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. శుక్రుడు డిసెంబర్ 5, 2022 సాయంత్రం 6.07 గంటలకు వృశ్చికరాశి నుండి ధనుస్సు రాశిలో (Venus transit in Sagittarius 2022) ప్రవేశించనున్నాడు. శుక్రుని యొక్క ఈ సంచారం కొన్ని రాశిచక్ర గుర్తులకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది. శుక్రుని సంచారం ఏ రాశులకు శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
మేషం (Aries): జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ రాశి యొక్క అదృష్ట స్థానంలో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీంతో వీరు అనేక ప్రయోజనాలను పొందనున్నారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. మెుత్తానికి ఈ సమయం మీకు సూపర్ గా ఉంటుంది.
సింహం (Leo): ఈ రాశిచక్రంలోని 5వ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీంతో వీరి లవ్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న వారి కల నెరవేరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులు పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా బిజినెస్ విస్తరించే అవకాశం కూడా ఉంది.
వృశ్చిక రాశి (Scorpio): శుక్రుడు వృశ్చిక రాశిలోని రెండవ ఇంటిలో సంచరిస్తాడు. దీంతో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఉద్యోగులు కూడా లాభపడతారు.
కుంభ రాశి (Aquarius): శుక్రుడు నాల్గవ ఇంటిలో అంటే కుంభ రాశి వారికి అదృష్ట గృహంలో సంచరించబోతున్నాడు. శుక్రుని యొక్క ఈ సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వివిధ వనరుల ద్వారా ఆదాయం వస్తుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు.
Also Read: Jupiter Transit 2022: ఒకే రాశిలోకి గురు, శని, రాహు గ్రహాలు..ఆ రాశులవారికి డబ్బే..డబ్బే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook