Jupiter Transit 2022: ఒకే రాశిలోకి గురు, శని, రాహు గ్రహాలు..ఆ రాశులవారికి డబ్బే..డబ్బే..

Jupiter Transit 2022: నూతన సంవత్సరంలో చాలా గ్రహాలు తమ సొంత రాశులను వదిలి ఇతర రాశిలో తిరోగమనం చెందబోతున్నాయి. దీని ప్రభావం చాలా రాశులపై పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 10:03 AM IST
Jupiter Transit 2022: ఒకే రాశిలోకి గురు, శని, రాహు గ్రహాలు..ఆ రాశులవారికి డబ్బే..డబ్బే..

Jupiter Transit 2022: నూతన సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సరం రావడానికి కేవలం నెల 15 రోజులు మాత్రమే ఉంది. అయితే ప్రతి ఒక్కరూ తమ కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, విద్య, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారు. అయితే రాశి చక్రాల పరంగా 2023 ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.

2023 మొదటి నెలలోనే గురు, శని, రాహు గ్రహాలు తమ రాశులను వదిలి ఇతర రాశుల్లోకి సంచారం చేయబోతున్నారు. దీని ప్రభావం మనిషి జీవితంలోని కొన్ని అంశాలపై పడే అవకాశాలు ఉన్నాయి యి. అయితే ఇదే క్రమంలో బృహస్పతి, శని గ్రహాలు కూడా తమ రాశులను వదిలి ఇతర రాశులోకి ప్రవేశించబోతున్నాయి. కారణంగా దీని కారణంగా మనిషి జీవితంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. 2023 సంవత్సరంలో గ్రహాలు రాశుల్లోకి సంచారం చేయడం వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మేష రాశి:
మేష రాశి వారికి ఈ క్రమంలో వృత్తిపరమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఇక ఉద్యోగాలపరంగా మంచి ప్రయోజనాలు పొందడమే కాకుండా ప్రశంసలకు కూడా లభిస్తాయి. అయితే ఈ సంవత్సరంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలు న్నారు అంతేకాకుండా 2023 ఏప్రిల్ గురుగ్రహం మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ఆర్థికంగా జీవితంలో గొప్ప పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. అయితే ఈ రాశి వారు శని దేవుని అనుగ్రహం కోసం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే శని దేవుని అనుగ్రహం లభించి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు.

కన్య రాశి:
వచ్చే కొత్త సంవత్సరంలో నెల ప్రారంభంలోనే కుంభరాశిలోకి శని సంచారం చేయడం వల్ల కన్యా రాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారికి గృహస్పతి ఏడవ స్థానంలో ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వీరికి మంచి ఎదుగుదల ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి జనవరి నుంచి శుభ ఘడియలు మొదలవుతాయి. 2023 సంవత్సరంలో ఆదాయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా షేర్ మార్కెట్లో షేర్ల విలువ విచ్చలవిడిగా పెరుగుతుంది.

మకర రాశి:
2023 నూతన సంవత్సరంలో శని గ్రహం మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది దీని కారణంగా సడే సతి దశ చివరికి చేరుతుంది. దీంతో మకర రాశి వారికి అన్నీ శుభాలే జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే జనవరి 17న శనిగ్రహం కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. దీంతో ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది అంతే కాకుండా స్నేహితుల నుంచి ప్రోత్సాహం లభించింది. వారు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయ ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్‌ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్‌ వీడియో..

Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News