Solar And Lunar Eclipse In 2023: ఒకే నెలలో సూర్య,చంద్ర గ్రహణాలు..ఏం జరుగతుందో తెలుసా?
Solar And Lunar Eclipse In 2023: 2023 సంవత్సరంలోని చివరిగా ఏర్పడబోయే చంద్రగ్రహణ ప్రభావం భారత్‌పై పడబోతోంది. కాబట్టి సూతక కాలం కూడా చెల్లుబాటు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే సూర్యగ్రహణం ప్రభావం భారత్‌పై ఎంత వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Solar And Lunar Eclipse In 2023: ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో రెండు గ్రహణాలు వస్తున్నాయి. అక్టోబర్ 14 శనివారం ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం సంభవించబోతోంది. అయితే దీని తర్వాత సరిగ్గా 15 రోజుల తర్వత అక్టోబర్ 29న చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఇలా రెండు గ్రహాణాలు సంభవించడానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ గ్రహణాలు రెండు భారతలో కనిపిస్తాయా?, సూతకాలం ఉండబోతుందా? ఈ గ్రహణాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో ఏర్పడిన గ్రహణాలు భారత్‌లో కనిపించలేదు. కాబట్టి వీటి వల్ల ఏర్పడే సూతక కాలం కూడా చెల్లలేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అక్టోబర్ 14న సంభవించే సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ అవ్వడంతో భారత్‌పై కూడా ప్రభావం చూపే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ గ్రహణంలో సూర్యుడు రింగ్ ఆకారంలో కనిపిస్తాడు. ఈ సమయంలో సూర్యుడుని చంద్రుడు 91 శాతం వరకు కప్పి ఉంచుతుంది.
చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!
2023 సంవత్సరంలో సంభవించిన ఈ గ్రహణాలు అమెరికాలోని 8 రాష్ట్రాల్లో బాగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి భారత్‌లో కనిపించే అవకాశాలు లేవని శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో 14 అక్టోబర్ ఏర్పడబోయే రెండవ సూర్యగ్రహణం కారణంగా ఏర్పడే సూతక కాలం కూడా చెల్లుబాటు అవ్వదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ సంవత్సరం 14 అక్టోబర్ 2023న ఏర్పడబోయే రెండవ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, పెరూ, క్యూబా, జమైకా, హైతీ, బ్రెజిల్, బహామాస్, ఆంటిగ్వా, ఉరుగ్వే, ఉత్తర అమెరికా, బార్బడోస్ మొదలైన ప్రదేశాల్లో క్లీయర్‌గా కనిపిస్తుంది. ఇక చంద్రగ్రహణం విషయానికొస్తే..ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం భావించవచ్చు. ఇది అక్టోబర్ 29 మధ్యాహ్నం 01:06 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:22 గంటలకు ముగుస్తుంది. ఇది భారత్‌లో రాత్రి 1 గంట 16 నిమిషాలకు కనిపిస్తుంది. అంతేకాకుండా దీని కారణంగా ఏర్పడే సూతక కాలం కూడా చెల్లుబాటు అవుతుంది.
చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.