Solar And Lunar Eclipse: రెండవ సూర్య, చంద్ర గ్రహణాలు అప్పుడే, కేవలం ఈ ప్రాంతాల్లోనే కనిపిస్తాయి!
Solar And Lunar Eclipse: రెండవ సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో అక్టోబర్ 14న ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. ఏయే ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Solar And Lunar Eclipse: ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడింది. ఈ సూర్య, చంద్రగ్రహాలకు హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా మొదటి చంద్రగ్రహణం మే 5 రాత్రి జరిగింది. ఇవే కాకుండా ఈ ఏడాది మరో 2 గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. 2023 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవించబోతున్నాయి. ఇందులో రెండు చంద్రగ్రహణాలు కాగా మరో రెండు సూర్యగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా వీటిలో రెండు గ్రహణాలకు సూతకం కాల సమయాలు వర్తించనున్నాయి. అయితే ఈ గ్రహాణాలు ఏయే తేదిల్లో ఏర్పడబోతున్నాయో, వీటి ప్రాముఖ్య ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రెండవ సూర్యగ్రహణం:
ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14న సంభవించబోతోంది. అయితే ఈ గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా దీనిని కంకణాకార సూర్యగ్రహణం అని కూడా అంటారు. ఈ సూర్యగ్రహణాన్ని ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ చూడవచ్చు. అంతేకాకుండా ఈ గ్రహణం సమయంలో సూర్యుని మధ్య భాగాన్ని చంద్రుడు పూర్తిగా కప్పేస్తాడు. కాబట్టి ఈ గ్రహణ సమయంలో సూర్యుని బయటి భాగం ఉంగరంలా మెరుస్తూ కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహణంలో సూర్యుని బయటి భాగం అగ్ని వలయంలా కనిపిస్తుంది.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
రెండవ చంద్ర గ్రహణం:
ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 5న ఏర్పడింది. అయితే రెంవడ చంద్రగ్రహణం అక్టోబర్ 28న సంభవించబోతోంది. ఈ చంద్రగ్రహణం పాక్షిక ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహణ సమయంలో భూమిని చంద్రుడు పూర్తిగా కవర్ చేస్తాడు. అందుకే చంద్రుడి కొంత భాగమే చికటిగా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహణం కేవలం పౌర్ణమి రోజే ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రహణం యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనిపించబోతోంది.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి