Diwali 2022 Date:  దీపావళి పండుగను కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈసారి దీపావళి అక్టోబర్ 24న వస్తోంది. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం దీపావళి (Diwali 2022) తర్వాతి రోజు అంటే అక్టోబరు 25న ఏర్పడనుంది. అయితే సూర్యగ్రహణ సూతక కాలం దీపావళి రాత్రి నుండే ప్రారంభమవుతుంది. రెండో సూర్యగ్రహణం (Solar Eclipse 2022), దీపావళి పండుగల తేదీ మరియు శుభ సమయం గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యగ్రహణం సమయం 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో రెండో సూర్య గ్రహణం అక్టోబర్ 25 న ఏర్పడబోతోంది. భారతదేశ కాలమానం ప్రకారం, అక్టోబర్ 25న సాయంత్రం 4:29 నుండి 5:24 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. అయితే ఈ గ్రహణం భారత్ లో కనిపించదు. దీని ప్రభావం కూడా మనదేశంపై పెద్దగా ఉండదు. దీపావళి రోజున రాత్రి 2 గంటల నుండి సూర్యగ్రహణం యొక్క సూత కాలం ప్రారంభమవుతుంది. 


దీపావళి 2022 తేదీ
కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య  అక్టోబర్ 24 సాయంత్రం 5:28 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 25 సాయంత్రం 4.18 వరకు కొనసాగుతుంది. అదే సమయంలో, ఈ రోజున ప్రదోష వ్రతం కూడా ఉంది.  ఈ రోజున ప్రదోష వ్రత పూజా సమయం సాయంత్రం 5.50 నుండి రాత్రి 8.22 వరకు. 


దీపావళి రాత్రి తంత్ర సాధనకు చాలా మంచిదని భావిస్తారు. ఈ రోజున మహానీయుల కాలం జరుగుతోంది. పంచాగం ప్రకారం, ఈ కాలం అక్టోబర్ 24 రాత్రి 10:55 నుండి అక్టోబర్ 25 మధ్యాహ్నం 1:53 వరకు ఉంటుంది. తంత్ర విద్యకు మహనీయుల కాలం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో మహంకాళిని పూజిస్తారు. 


Also Read: Astrology Tips: మల్లెనూనెతో 41 రోజులు ఆ దేవుడిని పూజిస్తే ఇక అన్నింటా విజయం మీదే!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook