Solar Eclipse 2023: సూర్య గ్రహణం ఇవాళ అక్టోబర్ 14న ఉంది. జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణం అశుభ సూచకమంటారు. అయితే ఈసారి సూర్య గ్రహణం 5 రాశులకు అదృష్టంగా మారనుంది. కారణం ఈ సూర్య గ్రహణం నాడు ఏర్పడుతున్న త్రిగ్రహ యోగం. ఏయే రాశులకు ప్రయోజనం కలగనుందో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య గ్రహణం సందర్భంగా ఇవాళ అంటే అక్టోబర్ 14న త్రిగ్రహ యోగం ఏర్పడుతోంది. ఈ రోజున సూర్యుడు, బుధుడు, చంద్రుడు మూడు గ్రహాలు కలిసి త్రిగ్రహ యోగం ఏర్పర్చనున్నాయి. సూర్య గ్రహణం రోజున ఈ మూడు గ్రహాలు కన్యా రాశిలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడనుంది. కన్యా రాశికి దేవత స్వయంగా దుర్గా దేవీ కావడంతో ఈ యోగం అత్యంత శుభప్రదం కానుంది. ప్రత్యేకించి 5 రాశులకు అమితమైన లాభాలు తెచ్చిపెట్టనుంది. ఆకశ్మిక ధనలాభంతో పాటు అనుకున్న పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తయిపోతాయి. 


వృశ్చిక రాశి జాతకులకు  ఈ యోగం అదృష్టాన్ని తెచ్చిపెట్టనుందని జ్యోతిష్య పండితులు చెబుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అద్భుతమైన వృద్ధి ఉంటుంది. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు రావడంతో ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రతి రంగంలో విజయం ఈ రాశివారిదే అవుతుంది. దుర్గాదేవి కటాక్షంతో అదృష్టం తోడుగా నిలుస్ుతంది. 


మకర రాశి జాతకులకు ఈ సమయం చాలా అనుకూలమైందిగా పరిగణిస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. ఉద్యోగస్థులకైతే కొత్త అవకాశాలు లాభించవచ్చు. అదృష్టం ఎప్పుడూ తోడుగా ఉండటం వల్ల విజయం ఎప్పుడూ మీదే అవుతుంది. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగదు. ఆరోగ్యంపై మాత్రం కాస్త శ్రద్ధ అవసరమౌతుంది.


మిధున రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలమైంది. విదేశీ ప్రయణాలు చేయవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆర్దికంగా మంచి స్థితిలో ఉంటారు. 


తులా రాశి జాతకులకు ఈ సమయం చాలా మంచిది. నలుగురిలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పనుల వల్ల మీపై ప్రశంసలు లభిస్తాయి. గౌరవ మర్యాదులంటాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. పదోన్నతి ఉండటం వల్ల ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది. 


సింహ రాశి జాతకులకు చాలా మంచి సమయం. కొత్త మార్గాల్నించి ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించనున్నారు. దుర్గా దేవి కటాక్షంతో ప్రత్యర్ధులు సైతం పరాజయం పొందుతారు. ఎప్పుడూ విజయం మీదే అవుతుంది. వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు. 


Also read: Ram Mandir: రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఆ వీఐపీలకు నో ఎంట్రీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook