COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Solar Eclipse 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే 2024 సంవత్సరంలో రాబోయే సూర్యగ్రహణం ఏప్రిల్‌లో సోమవతి అమావాస్య రోజు ఏర్పడబోతోంది. ఇది ఏప్రిల్ 8వ తేదీన తేదిన జరగబోతోంది. త్వరలోనే ఏర్పడబోయే మొదటి సూర్యగ్రహం భారత్‌లో కనిపించదు. ఇది అమెరికాతో పాటు ఇతర దేశాల్లో క్లియర్‌గా కనిపిస్తుందని ఖగోళ నిపుణులు తెలుపుతున్నారు. ఇక భారత్‌ విషయానికొస్తే, ఈ గ్రహం కనిపించదు కాబట్టి ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సూతకకాలం కూడా చెల్లబాటు కాదని వారంటున్నారు. కానీ ఈ గ్రహణం కారణంగా కొన్ని రాశులవారు మాత్రం ప్రభావితమవుతారు. దీని కారణంగా కొన్ని రాశులవారు తీవ్రంగా నష్టపోతే మరికొన్ని రాశులవారు అనేక లాభాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 



ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి వారికి ఈ సూర్యగ్రహణం కారణంగా జీవితంలో అనేక మార్పులను పొందుతారు. దీంతో పాటు ఈ సమయంలో వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయి. అలాగే ఈ సమయంలో  జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.


మేషరాశి:


కన్యా రాశి:


ఈ సూర్యగ్రహణం సమయంలో కన్యా రాశివారి జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వీరు ఈ సమయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. లేకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


వృశ్చిక రాశి:


సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా వృశ్చిక రాశివారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా వృత్తి పరమైన జీవితంలో కూడా అనే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు వీరు ఉన్నత స్థానానికి చేరుకునే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు ఊహించని విజయాలు కూడా సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


కుంభ రాశి:


కుంభ రాశి వారికి ఈ గ్రహణం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు గొప్ప విజయాలు కూడా సాధిస్తారు. అలాగే ఎలాంటి కొత్త పనులు ప్రారంభించిన మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా కీలక నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్‌ ఉంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి