Surya Grahan 2023: రెండో సూర్యగ్రహణం ఎప్పుడు? ఎక్కడెక్కడ కనిపిస్తుంది?
Solar Eclipse effect: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం గత నెల 20న ఏర్పడింది. అయితే తర్వాత సూర్యగ్రహణం ఎప్పుడు, దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Surya Grahan 2023 Date and Time: మన దేశంలో గ్రహణాలకు సంబంధించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సాధారణంగా చాలా మంది ప్రజలు గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు.శాస్త్రవేత్తలు గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. ఈ ఏడాది ఇప్పటికే సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించాయి.
అయితే రెండో సూర్యగ్రహణం కూడా ఈ సంవత్సరంలోనే జరగబోతుంది. ఇది అక్టోబరు 14న ఏర్పడుతుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ఇప్పుడు ఏర్పడబోయేది కంకణాకృత్ సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం కన్యారాశి మరియు చిత్రా నక్షత్రంలో ఆశ్విన్ మాసంలోని అమావాస్యలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం అక్టోబరు 14, శనివారం రాత్రి 8:34 గంటలకు ప్రారంభమై.. అర్ధరాత్రి 2:25 గంటల వరకు ఉంటుంది. దీని ప్రభావం ఆరు గంటలకుపైగా ఉంటుంది.
తదుపరి సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
బ్రెజిల్, పరాగ్వే, జమైకా, హైతీ, పెరూ, ఉరుగ్వే, ఈక్వెడార్, వెనిజులా, యునైటెడ్ స్టేట్స్, చిలీ, డొమినికా, బహామాస్, నికరాగ్వా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కెనడా, గ్వాటెమాల, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, క్యూబా, బార్బడోస్, ఆంటిగ్వా.
కంకణాకార సూర్యగ్రహణం
అక్టోబర్ నెలలో సంభవించే తదుపరి సూర్యగ్రహణం కంకణాకృత సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుని మధ్యలోకి వస్తాడు. అప్పుడు రింగ్ లాంటి ఆకారం ఏర్పడుతుంది. దీనిని వార్షిక సూర్యగ్రహణం లేదా కంకణాకృత సూర్యగ్రహణం అని కూడా పిలుస్తారు.
గ్రహణ సమయంలో ఈ విషయాలను పాటించండి..
** గ్రహణాన్ని కళ్లు తెరిచి చూడకండి.
** సూతకాల సమయంలో దేవుళ్ళ మరియు దేవతల విగ్రహాలను తాకవద్దు.
** గ్రహణ కాలంలో ఏమీ తినకూడదు.
** గోళ్లు మరియు జుట్టు కత్తిరించడం కూడా మానుకోవాలి.
** గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.
** మంత్రాలు మరియు శ్లోకాలు జపించండి.
Also Read: Mercury Mars transit: మరో మూడు రోజుల్లో ఈ 4 రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook