Surya Grahan effect: కాసేపట్లో సూర్యగ్రహణం.. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి..
Solar Eclipse 2023 date: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహణాలు మనుషులుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మరికాసేపట్లో సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేయాలి, ఏమి చేయకూడదు తెలుసుకోండి.
Surya Grahan effect: మరికొన్ని గంటల్లో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇది ఈ ఏడాది రెండవ లేదా చివరి సూర్యగ్రహణం. అయితే గ్రహణం మనదేశంలో కనిపించదు, అందుకే సూతక్ కాలం కూడా చెల్లదు. అయితే ఈ గ్రహణం అక్టోబరు 14 రాత్రి సంభవించనుంది. పైగా ఇదే రోజు సర్వపితృ అమావాస్య కూడా. గ్రహణ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఎటువంటి పనులు కానీ, శుభకార్యాలు కానీ చేయరు. గ్రహణ కాలంలో ఏమి చేయకూడదో తెలుసుకుందాం.
ఏమి చేయాలి, ఏమి చేయకూడదు?
** గ్రహణ సమయంలో పూజలు మరియు పారాయణాలు చేయడం నిషేధం.
** సూర్యగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడి నుండి హానికరమైన కిరణాలు విడుదలవుతాయి. ఇది పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతారు. గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు నిద్రించడం మంచిది కాదు.
** గ్రహణ సమయంలో సూది, కత్తి, కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. అలా చేయడం అశుభరంగా భావిస్తారు.
** సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా కళ్లతో చూడకూడదు. బైనాక్యూలర్ ద్వారా చూడటం మంచిది.
** గ్రహణ సమయంలో తినడం, తాగడం చేయకూడదు. మీరు ఏదైనా తినాలనుకుంటే అందులో తులసి ఆకులను కలపండి. ఇలా చేయడం వల్ల గ్రహణ సమయంలో ఆహారం, నీరు మొదలైనవి కలుషితం కాకుండా ఉంటాయి.
** గ్రహణం ముగిసిన తర్వాత గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలి. అలాగే ఇంటిని గంగాజలంతో శుభ్రం చేయండి. గ్రహణం తరువాత హనుమంతుడిని పూజించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి