Navratri 2023: రేపటి నుంచి దేవీనవరాత్రులు ప్రారంభం.. తొలి రోజు దుర్గాదేవి యెుక్క ఏ అవతారాన్ని పూజిస్తారో తెలుసుకోండి..

Navratri 2023: అక్టోబరు 15 నుంచి దేవీనవరాత్రులు మెుదలకానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ పండుగలో తొలి రోజు శైలపుత్రి దుర్గామాతను పూజిస్తారు. శుభసమయం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2023, 07:41 PM IST
Navratri 2023: రేపటి నుంచి దేవీనవరాత్రులు ప్రారంభం.. తొలి రోజు దుర్గాదేవి యెుక్క ఏ అవతారాన్ని పూజిస్తారో తెలుసుకోండి..

Navratri 2023 Day 1: రేపటి నుంచి దేవీనవరాత్రులు ప్రారంభంకానున్నాయి. నవదుర్గల అవతారాల్లో తొలి రోజు శైలపుత్రీ దుర్గామాతను పూజిస్తారు.  నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. పర్వత రాజు హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టీ ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీ, భవానీ, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా పార్వతీదేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటుంది. ఈ అమ్మవారి వాహనం వృషభం. 

మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి ఈ అవతారంలో వస్తుంది. కాబట్టి నవరాత్రుల మొదటిరోజు శైలపుత్రీ దుర్గాదేవిని ఆరాధిస్తారు. యోగ సాధన కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. ఈ రాత్రి శైలపుత్రీ దుర్గా దేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకుంటారని ప్రజల విశ్వాసం. ఈ దేవతను పూజించడం వల్ల మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. 

శుభ ముహూర్తం, పూజా విధానం
ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15, 2023న ప్రారంభమై.. అక్టోబర్ 24, 2023న ముగుస్తాయి. అక్టోబర్ 15 నవరాత్రుల మొదటి రోజు. తొలి రోజు శైలపుత్రీ అమ్మవారిని పూజించడమే కాకుండా ఘట లేదా కలశ స్థాపన కూడా చేస్తారు. సారి అభిజిత్ ముహూర్తం అక్టోబర్ 15వ తేదీ ఉదయం 11.28 గంటలకు ప్రారంభమై..మధ్యాహ్నం 12:23 గంటల వరకు ఉంటుంది. ఈ 45 నిమిషాల్లోనే కలశ స్థాపన చేయాలి. ఈ రోజున శైలపుత్రి అమ్మవారిని విగ్రహం లేదా ఫోటోను పెట్టి దూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. తెల్లని పూలతో అమ్మవారి పూజ చేస్తారు. అంతేకాకుండా ఆ దేవికి నైవేద్యంగా పండ్లు, స్వీట్లు పెడతారు. మంత్రాలను పఠిస్తూ ఆరాధన చేస్తారు. చివరిగా హారతి ఇచ్చి పూజను ముగిస్తారు. 

Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News