Solar Eclipse 2022: ఈ రాశుల వారికి సూర్యగ్రహణం ఎఫెక్ట్.. అక్టోబర్ 25 నుంచి వీరికి డబ్బే..డబ్బు..
Solar Eclipse Time in India: అక్టోబర్ 25 రోజున సూర్యగ్రహం ఏర్పడ బోతోంది. అయితే ఈ క్రమంలో పలు రాశులవారికి శుభ ఘడియలు రాబోతున్నాయి. ఈ రాశుల వారు ఆర్థికంగా బలపడడమేకాకుండా.. మంచి ప్రయోజనాలు పొందుతారు.
Solar Eclipse in India Date and Time: అక్టోబర్ 25 మంగళవారం రోజున సూర్యగ్రహం తులారాశిలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ క్రమంలో తులారాశిలో సూర్యుడు, శుక్రుడు, కేతువు, చంద్రుడు కూడా ఉంటారు. అయితే దీని ప్రభావవం పలు రాశులపై ప్రభావవం పడనుంది. ముఖ్యంగా ఈ గ్రహణం ప్రభావం 4 రాశులపై తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు పెర్కొన్నారు. అయితే ఈ రాశుల వారికి మంచి ప్రయోజనాలు చేకూరే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ క్రమంలో కొన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సూర్యగ్రహణం కారణంగా ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో, వారిని ఎలాంటి అదృష్టం వరిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నం..
కర్కాటక రాశి సూర్యగ్రహణం ప్రభావం:
కర్కాటక రాశి ఈ గ్రహణం కారణంగా అదృష్టం వరించబోతుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగ రంగంలో ప్రమోషన్, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు అధిక మొత్తంలో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.
సూర్యగ్రహణం ప్రభావం సింహరాశిపై:
సింహ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రం లభించి.. వీరు ఆర్థికంగా బలపడుతారు. అంతేకాకుండా వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి సూర్య గ్రహం కారణంగా ఆదాయం పెరుగుతుంది. కంపెనీల్లో పదోన్నతులు పొందుతారు. ముఖ్యంగా యువకులకు ఇంట్లో వారి పూర్తి మద్దతు లభిస్తుంది. అన్ని రంగాల్లో వీరు విజయాలు సాధిస్తారు.
ధనుస్సు రాశిపై సూర్య గ్రహణ ప్రభావం:
ధనుస్సు రాశి వారికి దీపావళి తర్వాత ఏర్పడే సూర్యగ్రహణం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికపరమైన లాభాలు అధికంగా పొందే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో వ్యాపార రంగాల్లో వీరు మంచి ఫలితాలు పొందుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారి ఆరోగ్యం మెరుగుపగుపడుతుంది.
మీనరాశిపై సూర్యగ్రహణం ఎఫెక్ట్:
సూర్య గ్రహణం వల్ల మీన రాశి వారికి శుభ ఘడియలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ క్రమంలో సులభంగా ఉపశమనం పొందుతారు. వ్యాపార క్రమంలో మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా వీరు బలపడతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook