Somvati Amavasya 2022: సోమవతి అమావాస్య రోజున అద్భుత యాదృచ్ఛికం... ఈ 4 పనులు చేస్తే పితృదోషం తొలగిపోతుంది!
Somvati Amavasya 2022: జ్యేష్ఠ మాసంలో ఈ సారి అమావాస్య సోమవారం వస్తుంది. అందుకే దీనిని సోమవతి అమావాస్య అంటారు. ఈరోజున కొన్ని చర్యలు చేపట్టడం వల్ల మీ ఇంట్లోకి డబ్బుతో పాటు ఆనందం కూడా వస్తుంది.
Somvati Amavasya 2022 Date: హిందూ మతంలో అమావాస్య తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. జ్యోతిషశాస్త్ర ప్రకారం, పితృ దోషం నుండి బయటపడటానికి అమావాస్య రోజున కొన్ని చర్యలు తీసుకోవాలి. మే 30న వచ్చే సోమవతి అమావాస్య (Somvati Amavasya 2022) రోజున చాలా ప్రత్యేకమైన యాదృచ్చికం జరుగబోతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో కొన్ని పనులు చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదంతోపాటు ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది.
30 మే 2022న, సోమవారం జ్యేష్ఠ మాసం అమావాస్య. శని జయంతి, వట్ సావిత్రి వ్రతం కూడా ఇదే రోజున పాటిస్తారు. 30 సంవత్సరాల తర్వాత శని జయంతి రోజున శని దేవుడు తన స్వంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు. ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం. దీంతోపాటు సర్వార్థ సిద్ధి, సుకర్మ యోగాలు కూడా ఈ రోజున ఏర్పడుతున్నాయి. అటువంటి సందర్భంలో చేసే దానధర్మం అన్ని పాపాలను నాశనం చేస్తుంది మరియు చాలా ప్రయోజనాలను ఇస్తుంది.
ఈ పనులు చేయండి
**సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు నీరు సమర్పించండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులయి..మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. పూర్వీకుల ఆశీర్వాదం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, సంతోషం పెరుగుతాయి.
**సోమవతి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేయండి. ఇది సాధ్యం కాకపోతే, పవిత్ర నది నీటిని కలిపి స్నానం చేయండి. దీంతో పాపాలు నశిస్తాయి.
**సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా దానం చేయాలి. ఈ రోజు పేదలకు దానం చేయడం వల్ల శని, చంద్ర దోషాలు తొలగిపోతాయి. దీనితో పాటు, పిత్ర దోషం నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఈ రోజున నీరు, గొడుగు, పాదరక్షలు, ఆహారం, నల్లని వస్త్రాలతో నిండిన కాడ దానం చేయడం ఉత్తమం.
**సోమవతి అమావాస్య రోజున మర్రి చెట్టును పూజించి..నీళ్లు పోయండి. ఇది మీ భాదలను తొలగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి