Sravana Masam 2022: శివుడి అనుగ్రహం పొందాలంటే.. శ్రావణంలో ఈ 5 పనులు చేయండి!
Sravana Masam 2022: శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల శ్రావణ మాసం. ఈ మాసంలో ఈ 5 పనులు చేస్తే శివుడి అనుగ్రహం మీకు లభిస్తుంది.
Sravana Masam 2022: శివునికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం జూలై 14న ప్రారంభమైంది. ఇది ఆగస్టు 12న ముగుస్తుంది. ఈ మాసంలో పరమశివుడిని (Lors Shiva) ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటూ శివారాధన చేస్తారు. ఆ మహాదేవుడి ఆశీస్సులతో ఐశ్వర్యం, ఆనందం పొందుతారు. అంతేకాకుండా వారు కష్టాల నుండి విముక్తి పొందుతారు. ఈ మాసంలో శివుడి అనుగ్రహం పొందడానికి ఈ 5 పనులను తప్పక చేయాలి. ఆ పనులేంటో తెలుసుకుందాం.
ఈ 5 పనులు తప్పక చేయండి
1. శ్రావణంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే... ప్రతి రోజూ శివలింగానికి రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేయాలి.
2. ఈ నెల మెుత్తం శివారాధన చేసేటప్పుడు శివ చాలీసాన్ని పఠించండి. దీని వల్ల వ్యక్తికి బుద్ధి, జ్ఞానం, శక్తి, సంపదను పొందుతారు.
3. ఈ మాసంలో శివుడి అనుగ్రహం పొందాలంటే... పరమేశ్వరుడికి ఇష్టమైన వస్తువులతో పూజను చేయండి. మీరు పూజా సామగ్రిలో పాలు, బెల్పాత్ర, దాతురాలను తప్పనిసరిగా చేర్చాలి.
4. శ్రావణ మాసంలో నిత్యం గోవుకు ఆహారం తినిపించడం ద్వారా, సేవ చేయడం ద్వారా ఆ మహేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే భగవంతుని కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.
5. ఈ నెలలో శ్రావణ సోమవార వ్రతాన్ని పాటిస్తే.. శివుడి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది.
Also Read: Healthy Heart: మీ డైట్‌లో ఈ ఒక్క ఫ్రూట్ చేర్చుకోండి... గుండెపోటుకు చెక్ పెట్టండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook