Healthy Heart: మీ డైట్‌లో ఈ ఒక్క ఫ్రూట్ చేర్చుకోండి... గుండెపోటుకు చెక్ పెట్టండి

Benefits Of Strawberry: దేశంలో హార్ట్ పేషెంట్స్ సంఖ్య రోజురోజూకు పెరుగుతుంది. మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే గుండెపోటుకు కారణమవుతున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 11:54 AM IST
Healthy Heart:  మీ డైట్‌లో ఈ ఒక్క  ఫ్రూట్ చేర్చుకోండి... గుండెపోటుకు చెక్ పెట్టండి

Benefits Of Strawberry: మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా మనిషి రోగాలబారిన పడుతున్నాడు. ఇటీవల కాలంలో చాలా మంది ఆయిల్, జంక్, ఫాస్ట్ పుడ్ తినడానికి అలవాటు పడ్డారు. దీని వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) పెరిగిపోయి అది రకరకాల జబ్బులకు కారణమవుతుంది. ముఖ్యంగా ఇది గుండెపోటుకు (Heart Attack) దారితీస్తుంది. రోజురోజూకు దేశంలో హార్ట్ ఫేషెంట్స్ సంఖ్య పెరుగుతుంది. ఈ తరుణంలో ఈ ఒక్క పండును తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. 

స్ట్రాబెర్రీ తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుందో.. గుండెకు కూడా అంతే మేలు చేస్తుంది. స్ట్రాబెర్రీల్లో (Benefits Of Strawberry) పోషకాలు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం (Heart Attack Risk) చాలా వరకు తగ్గుతుంది. స్ట్రాబెర్రీలను ముక్కులు చేసుకుని ప్రతి రోజూ 2 నుండి 3 కప్పుల నిండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ పెరిగేలా చేస్తుంది. గుండెపోటు రాకుండా ఉండాలంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి. స్ట్రాబెర్రీలను తినడం వల్ల బాడ్ కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా...గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.  

Also Read: Samsaptak Yog: శని-సూర్యుడు సంసప్తక యోగం... ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News