Sravana Masam 2022: రేపటి నుంచే శ్రావణ మాసం ప్రారంభం... ఈ మాసంలో చేయాల్సినవి, చేయకూడనవి?
Sravana Masam Puja tips: రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెలలో శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అయితే శ్రావణ మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదో? ఇప్పుడు తెలుసుకుందాం.
Sravana Masam Puja tips: శ్రావణ మాసం (Sravana Masam) శివుడికి ఎంతో ప్రీతకరమైన నెల. శ్రావణ మాసం రేపు అంటే 14 జూలై 2022 నుండి ప్రారంభం కానుంది. శివునికి (Lord Shiva) ఎంతో ఇష్టమైన ఈ మాసంలో పూజల చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి.. ఇక నుంచి మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. శివ పూజకు సంబంధించి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో చేయాల్సినవి, చేయకూడనవి?
>> శ్రావణ మాసంలోని అన్ని సోమవారాల్లో ఉపవాసం ఉండండి. ఓం నమః శివాయ మంత్రాన్ని పఠిస్తూ.. శివునికి అభిషేకం చేయండి. అంతేకాకుండా సోమవారం వ్రత కథను వినండి.
>> ఈ రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.
>> పంచామృతం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంగాజలం మొదలైన వాటితో శివలింగానికి అభిషేకం చేయండి.
>> వీలైతే ఈ మాసంలో రుద్రాక్షను ధరించండి.
>> పొరపాటున కూడా శ్రావణ మాసంలో నాన్ వెజ్, ఆల్కహాల్ తీసుకోకండి. ఇలా చేస్తే శివునికి కోపం వస్తుంది.
>> ఈ మాసంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి, ఎవరినీ అవమానించకండి.
>> సోమవారం ఉపవాసం చేసేటప్పుడు మధ్యలో ఆపకండి.
>> అంతేకాకుండా వెల్లుల్లి-ఉల్లిపాయ, ముల్లంగి, బెండకాయ మరియు అల్లం వంటివి తినకూడదు.
Also Read: Venus Transit July 2022: మిథునరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారి కెరీర్ అమోఘం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook