Venus Transit July 2022: మిథునరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారి కెరీర్ అమోఘం!

Venus Transit 2022: ఈరోజు శుక్ర గ్రహం మిధునరాశిలో ప్రవేశించబోతోంది. దీని సంచారం వల్ల ఏయే రాశులువారు లాభ పడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 10:45 AM IST
  • ఇవాళ మిథునరాశిలో శుక్రుడి ప్రవేశం
  • ఈ మూడు రాశులవారికి లాభం
Venus Transit July 2022: మిథునరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారి కెరీర్ అమోఘం!

Venus Transit 2022: లవ్, పెళ్లి, ఆనందం, అందం వంటి వాటికి కారకుడు శుక్రుడు. మీ జాతకంలో శుక్రుడు బలమైన  స్థానంలో మీ లైఫ్ తిరిగి చూసుకోనవసరం లేదు. ఒకవేళ జాతకంలో బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం కష్టాలమయం అవుతుంది. అయితే ఇవాళ అంటే జూలై 13న శుక్రుడు మిథునరాశిలోకి (Venus Transit in Gemini 2022) ప్రవేశిస్తున్నాడు. దీని సంచార ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే జెమినీలో శుక్రుడు కదలిక వల్ల మూడు రాశుల వారు లాభపడనున్నారు. ఆ రాశులేంటో చూద్దాం. 

కుంభం (Aquarius)- మిథునరాశిలో శుక్రుడి సంచారం కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. లైఫ్ ఆనందంతో నిండిపోతుంది. భారీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కొత్త జాబ్ రావచ్చు. ఈ సమయం వ్యాపారులకు అనుకూలిస్తుంది.  

తుల (Libra)- మిథునరాశిలో శుక్రుడి ప్రవేశించడం వల్ల ఈ రాశివారి కెరీర్ దూసుకుపోతుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సడన్ గా ప్రయాణ చేయడం కలిసి వస్తుంది. కుటుంబంలోని ఐక్యత ఉంటుంది. ఈ సమయంలో వీరికి అదృష్టం తోడై.. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. 

సింహం (Leo)- శుక్రుని సంచారం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వీరు చాలా డబ్బు సంపాదిస్తారు.  విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీకు ప్రశంసలు దక్కుతాయి. కొత్త జాబ్ వస్తుంది. మనీ ఆదా చేస్తారు.  

Also Read: Navgraha Dosha Remedies: నవగ్రహ దోషాల నుండి బయటపడాలంటే.. ఇవి నీటిలో కలిపి స్నానం చేయండి!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News