Sawan Skanda Sashti 2022: శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఆరో రోజున స్కంద షష్ఠి పండుగను జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తీకేయ స్వామిని (Lord Kartikeya) పూజిస్తారు. శ్రావణ స్కంద షష్ఠి  వ్రత (Sravana Skand Shashthi 2022) ప్రాముఖ్యత, పూజ ముహూర్తం గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్కంద షష్ఠి వ్రతం 2022 తేదీ, ముహూర్తం
శుక్ల పక్ష షష్ఠి తిథి ప్రారంభం: ఆగస్టు 03, ఉదయం 05:41 గంటలకు
శుక్ల పక్ష షష్ఠి తిథి ముగింపు: 04 ఆగస్టు, ఉదయం 05:40 గంటలకు
ఉదయతిథి ప్రకారం, శ్రావణ స్కంద షష్ఠి వ్రతం ఆగస్టు 03న జరుపుకుంటారు. స్కంద షష్ఠి వ్రతం రోజునే  సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, అమృతసిద్ధి యోగం, సిద్ధ యోగం మరియు సాధ్య యోగం ఏర్పడుతున్నాయి. 
సిద్ధ యోగం: ఆగష్టు 3, బుధవారం ఉదయం నుండి సాయంత్రం 05:49 వరకు. అనంతరం సాధ్య యోగం ప్రారంభమవుతుంది.
సర్వార్థ సిద్ధి యోగం: ఆగస్టు 3, బుధవారం, ఉదయం 05:43 నుండి సాయంత్రం 06.24 వరకు
అమృత సిద్ధి యోగం: ఆగస్టు 3, బుధవారం, ఉదయం 05:43 నుండి 09:51 వరకు
అమృత సిద్ధి యోగం: ఆ తర్వాత 04 ఆగస్టు మరుసటి రోజు సాయంత్రం 06:24 నుండి ఉదయం 05:44 వరకు


స్కంద షష్ఠి వ్రత  ప్రాముఖ్యత
స్కంద భగవానుడు సొరపదం అనే రాక్షసుడిని ఓడించిన రోజు షష్ఠి. సొరపాదం దుష్టకార్యాలను భరించలేక దేవతలు..శివపార్వతుల సహాయం కోరారు. రాక్షసుడిని ఓడించే ముందు కార్తీకేయుడు సోరపాదంతో ఆరు రోజుల పాటు పోరాడాడు. తన ఆయుధాన్ని సొరపాదంపై విసిరి రెండు భాగాలుగా చేశాడు. మొదటి సగం నెమలిగా మారింది. దానిని స్కందుడు తన వాహనంగా చేసుకున్నాడు. దేవతలు సంతోషించి స్వామిని స్తుతించారు. 


స్కంద షష్ఠి రోజున భక్తులు స్కంద షష్ఠి కవచాన్ని పఠిస్తారు. ఎవరైతే స్కంద షష్ఠిలో ఆరు రోజులు ఉపవాసం ఉండి మురుగన్ ప్రార్ధనలు చేస్తారో.. వారు మురుగన్ అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. ఎవరైతే స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారో.. వారికి దురాశ, కోపం మరియు అహంకారాలు నశిస్తాయి. కార్తికేయుని అనుగ్రహంతో.. ఆ వ్యక్తికి వ్యాధులు, దోషాలు మరియు శారీరక బాధల నుండి విముక్తి లభిస్తుంది. 


Also Read: Hariyali Amavasya 2022: ఇవాళే హరియాళీ అమావాస్య..ఈ రోజు ఈ 5 పనులు అస్సలు చేయకండి! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook