Hariyali Amavasya 2022: ఇవాళే హరియాళీ అమావాస్య.. ఈ రోజు ఈ 5 పనులు అస్సలు చేయకండి!

Hariyali Amavasya 2022:  ఈరోజు శ్రావణ హరియాళీ అమావాస్య. ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. వాటిని చేయడం వల్ల పితృ దోషం లేదా గ్రహ దోషాలు బారిన పడే అవకాశం ఉంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2022, 09:40 AM IST
Hariyali Amavasya 2022:  ఇవాళే హరియాళీ అమావాస్య.. ఈ రోజు ఈ 5 పనులు అస్సలు చేయకండి!

Hariyali Amavasya 2022:  శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే హరియాళీ అమావాస్య అంటారు. ఇవాళ అంటే జూలై 28న హరియాళీ అమావాస్య (Hariyali Amavasya 2022). నదీస్నానం, దానధర్మాలు, పూర్వీకులకు పూజలు చేయడం, మెుక్కలు నాటడం ఈ రోజు ప్రత్యేకత. ఈరోజు గురు పుష్య యోగంతోపాటు నాలుగు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. పితృదోషం నుండి బయటపడటానికి ఈ రోజు చాలా మంచి రోజు. ఈ రోజు తెలిసి తెలియక మీరు చేసే కొన్ని పనులు మిమ్మిల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. హరియాళీ అమావాస్య రోజు ఎలాంటి పనులు నిషిద్ధమో ఇప్పుడు తెలుసుకుందాం. 

హరియాళీ అమావాస్య నాడు ఈ పనులు చేయకండి
1. హరియాలీ అమావాస్య రోజు చెట్లకు సేవ చేయడం మరియు కొత్త మెుక్కలు నాటడం శుభప్రదంగా భావిస్తారు.  ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు, పితృ దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున మీరు చెట్లకు, మొక్కలకు హాని చేయకండి. ఇలా చేస్తే... మీరు గ్రహ దోషం లేదా పితృ దోషం బారిన పడవచ్చు.
2. హరియాళీ అమావాస్య సందర్భంగా పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణం, పిండదానం, శ్రద్ధ కర్మ మొదలైనవి చేయండి. ఈ రోజు మీ పూర్వీకులకు కోపం రాకుండా చూసుకోండి. దీని వల్ల మీ పనిలో వైఫల్యం, ధన నష్టం, ఆర్థిక సంక్షోభానికి  గురవుతారు. 
3. అమావాస్య రోజున కుక్క, ఆవు, కాకి మొదలైన వాటికి ఎటువంటి హాని చేయవద్దు. ఈ రోజున మీరు జంతువులను, పక్షులను చంపినా లేదా హాని చేసినా మీ పూర్వీకులకు మీపై కోపం రావచ్చు.
4. అమావాస్య రోజున బిచ్చగాళ్లు మీ ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వారిని పంపించకండి. ఆహారం, బట్టలు ఏదో ఒకటి దానం చేయండి. 
5. అమావాస్య నాడు మీ ఇంట్లోని పెద్దలను అవమానించడం కానీ, దుషించడం కానీ చేయకండి. 

Also Read: Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News