Sravana masam Diet: శ్రావణ మాసం వచ్చేస్తోంది. శ్రావణమాసంలో తొలి సోమవారం వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. శ్రావణమాసం వ్రతం సందర్భంగా ఏయే ఆహార పదార్ధాలు తీసుకుంటే మంచిదో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యం మనిషికి మేలు చేకూరుస్తుంది. ఫిట్ ఉంటే ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తవు. ప్రస్తుత రోజుల్లో ఫిట్‌గా ఉంటే ఏ విధమైన ఇబ్బందులు రావు.  ప్రత్యేకించి మహిళలు ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్‌గా ఉండటమంటే కేవలం జిమ్‌కు వెళ్లి వర్కవుట్లు చేస్తే సరిపోదు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. స్థూలకాయం రాకుండా సరైన ఆహార పదార్ధాలు తినాలి. లేకపోతే డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వస్తాయి. హిందూ పంచాంగం ప్రకారం..శ్రావణ మాసంలో సోమవారం నాడు వ్రతం ఆచరిస్తారు. శివుడికి ఇష్టమైన నెల కావడంతో..శ్రావణ సోమవారం వ్రతం చాలా మంచిదని చెబుతారు. ఆరోగ్యంగా ఉంచేందుకు వ్రతంలో ఏయే ఆహార పదార్ధాలు మంచివో తెలుసుకుందాం.


పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగుతో శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. పండ్లముక్కల్లో పెరుగు వేసి తింటే అద్భుత ప్రయోజనాలున్నాయి. పండ్ల ద్వారా లభించే కాల్షియం, ప్రోటీన్ బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. పండ్ల జ్యూస్ కూడా చాలా మంచిది. సాధ్యమైనంతవరకూ పండ్ల తినడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


పన్నీరు అనేది కేవలం రుచికే కాకుండా..ఆరోగ్యానికి కూడా చాలా లాభదాయకం. పన్నీరు అనేది పాల ఉత్పత్తి. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పన్నీరులో ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, ఐరన్ వంటి పోషక పదార్ధాలన్నీ పుష్కలంగా ఉంటాయి. పన్నీరులో ఉండే సెలెనియమ్, పొటాషియం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచివి. 


కొబ్బరికాయలో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది మీ ఒంటి కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గించేందుకు దోహదపడుతుంది. ఖాళీ కడుపున కొబ్బరి తింటే త్వరగా ఆకలి కూడా వేయదు. వ్రతం సందర్బంగా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో మెటబోలిజం ప్రక్రియ వేగవంతమౌతుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. 


Also read: Mauna Panchami 2022: మౌన పంచమి ఎప్పుడు? ఈ వ్రత ప్రాముఖ్యత ఏంటి?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook