Mauna Panchami 2022: శివారాధనకు శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనది. శ్రావణ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. అందులో ఒకటి శ్రావణ కృష్ణపక్షం ఐదో రోజున వచ్చే మౌన పంచమి. ఈ సారి మౌన పంచమి జూలై 18, 2022 సోమవారం నాడు వస్తుంది. ఈ రోజే మెుదటి శ్రావణ సోమవారం కూడా. మౌనపంచమి అనేది బీహార్ లో ప్రధానంగా జరుపుకునే పండుగ. ఈ రోజు శివుడితోపాటు నాగదేవతను కూడా పూజిస్తారు. మౌన పంచమి యెుక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ రోజున ఎందుకు మౌనంగా ఉండాలి?
మౌన పంచమి నాడు శివునితో పాటు నాగదేవతను పూజించడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున పరమేశ్వరుడిని మౌన వ్రతం పాటిస్తూ...ఆరాధించడం వల్ల వ్యక్తి యొక్క మానసికంగా మరియు శారీరంగా దృఢంగా ఉంటాడు. ఈ రోజున దక్షిణామూర్తి రూపంలో ఉన్న భోలేనాథ్‌కు పంచామృతం మరియు నీటితో అభిషేకం చేయడం వల్ల బుద్ధి మరియు జ్ఞానం పెరుగుతుంది.
ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి?
నూతన వధూవరులు మౌన పంచమి వ్రతం చేస్తారు.కొత్తగా పెళ్లయిన జంటలు ఈ రోజున ఉపవాసం ఉండి..శివుడిని పూజిస్తే వారి వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుందని నమ్ముతారు.
Also Read: Amarnath Yatra:అడుగడుగులో అపాయం.. అయినా బెదరని భక్తజనం! అమర్ నాథ్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook