Sri Dutta Kshetram: మానవ జీవితంలో అందరికీ సుఖ సంతోషాలు, కష్ట నష్టాలు అందరికీ వస్తుంటాయి. కొందరు తమకు వస్తున్న చిక్కుళ్ల నుంచి బయటపడటానికి దేవుడిని ఆశ్రయిస్తారు. అలాంటి కష్టాలు పడేవారు కర్ణాటకలోని ఒక ఆలయాన్నిసందర్శిస్తారు. ఇంతకీ ఆలయం ఏంటంటారా అత్యంత పవిత్రమైన దత్తక్షేత్రం. కర్ణాటకలోని గాణగాపూర్ దత్తక్షేత్రాన్ని దర్శిస్తే ఎంతటి కష్టాల నుంచైనా గట్టెక్కుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చటి చెట్లు, పక్కనే త్రివేణి సంగమం మధ్య గాణగాపూర్ క్షేత్రం వెలసింది. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు ఆ దత్తాత్రేయుడిని దర్శించుకొని భక్తులు తరిస్తారు. ప్రతి నిత్యం సంగమం వద్ద వందల సంఖ్యలో భక్తులు దత్త పారాయణం కూడా చేస్తారు. గాణగాపూర్ వెళ్లిన వారు మొదటగా  సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తారు. భీమా, అమర్జా నదులు కలిసే చోటును సంగమం అంటారు. ఆ తర్వాత సంగమం పక్కన ఉన్న ఔదుంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మనస్సులో కోరికను కోరుకొని ఆ చెట్టు వృక్షం ప్రదక్షిణలు చేసి ఆ దత్తాత్రేయుడిని దర్శించుకుంటే ఎంతటి కోరికలైనా నెరువేరుతాయనేది భక్తుల నమ్మకం.


దత్తాత్రేయ పీఠాలలతో అత్యంత ప్రసిద్ధిగాంచిన క్షేత్రాల్లో  గాణగాపూర్ చాలా ప్రముఖమైనది. కర్ణాటకలోని కాలబుర్గి(ఒకప్పటి గుల్బర్గా )జిల్లాలో ఈ పవిత్ర క్షేత్రం ఉంది. గాణగాపూర్ లో దత్తాత్రేయుడు అవతారమైన నృసింహ సరస్వతి గా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ఆ స్వామి వారి నిర్గుణ పాదుకలతో అలంకరింపబడి ఉంటుంది. ప్రతి నిత్యం వేలాది భక్తులు ఆ స్వామి వారి పవిత్ర పాదుకలను దర్శించి తరిస్తారు. అక్కడికి వెళ్లి వచ్చిన వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతుంటారు. అంతే కాదు గాణగాపూర్ వెళ్లినవారు ఒక రోజు రాత్రి అక్కడ నిద్రిస్తే కూడా మంచిదంటారు.


ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, పెళ్లిళ్లు కానీ వారు, సంతానం లేని వారు, ఉద్యోగ సమస్యలు,జాతకపర దోషాలు కలిగిన వారు ఈ గాణగాపూర్ క్షేత్రాన్ని దర్శిస్తే వాటి నుంచి తప్పకుండా ఉపశమనం పొందుతారనేది అక్కడి పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా సంగంమంలో ఆచరించే స్నానంతో మనకు ఉన్న సకల దోషాలు పోతాయని అక్కడి స్తాననికులు చెబుతారు. సంగమం చుట్టు పక్కల అష్ట తీర్థాలు ఉంటాయి. అక్కడి వెళ్లి ఆ అష్టతీర్థాల్లో దర్శించి స్నానమాచరించిన చాలా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.


 అంతే కాదు గాణగాపూర్ పక్కన కల్లేశ్వర్ ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ ఆ పరమిశివుడు కొలవై ఉంటారు. ఇక్కడే ఆ యొక్క శని భగవానుడు కూడా స్వయంభువుగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. గాణగాపూర్ వచ్చిన వారు కల్లేశ్వర్ ను కూడా దర్శించుకుంటే మంచిది. అలాగే అక్కడ శనిభగవానునికి తైలాభిషేకం కూడా చేస్తూ ఉంటారు. కల్లేశ్వర్ లో వెలసిని శని భగవానునికి తైలాభిషేకం చేస్తే శని దోషాల నుంచి విముక్తి కలుగుతుందని ఇక్కడి పండితులు చెబుతున్నారు.వీటితో పాటు కల్లేశ్వర్ ఆలయంలో అమ్మవారు, ఆంజనేయ స్వామి కూడా భక్తులకు దర్శనమిస్తారు.


గాణగాపూర్ వెళ్లాలనుకునేవారు బస్సులో కానీ, రైలులో కానీ వెళ్లవచ్చు. కాలబుర్గి వరకు ప్రతి నిత్యం బస్సులు, రైలులు అందుబాటులో ఉంటాయి. అక్డి నుంచి  ఆర్టీసీ కానీ ప్రభుత్వ వాహనాలు కానీ చాలా పెద్ద సంఖ్యలో గాణగాపూర్ వెళ్లడానికి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పౌర్ణమి, అమవాస్యలాంటి రోజుల్లో గాణగాపూర్ లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో అక్కడ వసతి దొరకడం కొంత కష్టం అవుతుంది. సాధారణ రోజుల్లో మాత్రం వసతి సౌకర్యాలకు అంతగా ఇబ్బంది ఉండదు.


Also Read: 2025 Astrology: 2025లో ఈ రాశుల వారికీ ఊహించని జాక్ పాట్.. ఉగ్యోగంలో ప్రమోషన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి